Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్ట్రీమింగ్‌కు సిద్దంగా రొమాంటిక్ మూవీ

Advertiesment
స్ట్రీమింగ్‌కు సిద్దంగా రొమాంటిక్ మూవీ
, బుధవారం, 17 నవంబరు 2021 (13:58 IST)
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన సినిమా రొమాంటిక్. ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. పూరి జ‌గ‌న్నాథ్ నిర్మాణ భాద్యతలు చూసుకున్నారు. ఆకాష్ రొమాంటిక్ సినిమాకు స‌పోర్టుగా.. రెబల్ స్టార్ ప్రభాస్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పాటు పలువురు నిలిచారు.
 
 
ఇటీవ‌లే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అలాగే సినిమాలో ఆకాశ్ పూరి తన మార్క్ కు చూపించాడు. త‌న న‌ట‌న‌కు మంచి మార్కులు కొట్టేశాడు.
 
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్‌కు సిద్దంగా ఉంది. నవంబర్ 26న స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయ్యింది ఆహా. ఈ మేరకు అధికార ప్రకటన కూడా విడుదల చేసింది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌హేశ్ బాబు సరసన లావణ్య త్రిపాఠి..