Charmi,puri,akash, ketika
`రొమాంటిక్` సినిమా చూశాక ఏడ్చేశాను- అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. ఆయన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ శుక్రవారంనాడు విడుదలకానుంది. ఒకరోజు ముందుగానే కొంతమంది సెలబ్రిటీస్‌తో ఎ.ఎం.బిమాల్‌లో పూరీ సినిమాను వీక్షించారు.
అనంతరం పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ఇంటెన్స్ లవ్ స్టోరీ సినిమా చూసి చాలా రోజులైంది. సినిమా చాలా బాగుంది. మూడేళ్ల తరువాత థియేటర్లో సినిమా చూడటం చాలా బాగుంది. ప్రేమ కన్నా మోహం చాలా గొప్పది.. మోహం నుంచే ప్రేమ పుడుతుంది.. ప్రేమలో ఉన్నా కూడా వాళ్ళిద్దరూ మోహమే అని అనుకుంటారు.. ఈ సినిమాకు అదే ఫ్రెష్‌గా ఉంటుంది. ఆకాష్ మంచి నటుడు అని రాజమౌళి కూడా చెప్పారు. సినిమా చూసిన చాలా మంది ఎమోషనల్ అయ్యారు.
- థియేటర్ కాకపోతే ఏడ్చేవాళ్లమని చాలా మంది చెప్పారు. ముందే ఎడిటింగ్ రూంలో చూసినప్పుడు నాకు కూడా ఏడుపు వచ్చింది. ఇది ఇడియట్ లాంటి సినిమా అని అందరూ అన్నారు. ఆకాష్ మంచి నటుడే. కానీ రొమాన్స్‌లో వీక్. ఇంకా బాగా చేస్తాను అంటే ఇంకా బాగా రాస్తాను.
- వాడు నన్ను సరిగ్గా వాడుకోవడం లేదు. ఇలాంటి తండ్రి అందరికీ దొరకడు. ఈ చిత్రాన్ని యంగ్ జనరేషన్ తీస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే అనిల్‌కు ఇచ్చాను. కథను ఎంతో ప్రేమిస్తే గానీ కూడా అలాంటి ఎమోషన్‌ను క్యారీ చేసేలా తీయడం మామూలు విషయం కాదు. అనిల్ బాగా తీశాడు. దర్శకులందరూ వచ్చి ఈ చిత్రాన్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇదొక మంచి వాతావరణాన్ని క్రియేట్ అయ్యేలా చేస్తుంది.
- రామ్ గోపాల్ వర్మ గారు కూడా సినిమా చూస్తే బాగుండేది. మళ్లీ నా మీద షాంపైన్ పోసేవారు. ఆయన ఏలూరులో షూటింగ్‌లో ఉన్నారు. అందుకే రాలేకపోయారు. నటుడిగా ఆకాష్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. ఇది పెద్ద హీరో కథ. కానీ ఆకాష్ బాగా హోల్డ్ చేశాడు. బయట సినిమాలు చేయనివ్వు.. కొంచెం పేరు వచ్చాక. మనం చేద్దామని ఆకాష్ అన్నాడు. సినిమా విడుదలవుతుందని తెలిసి.. ప్రభాస్ ఫోన్ చేశాడు. డార్లింగ్ మనం ఏం చేద్దాం.. ఎలా ప్రమోట్ చేద్దామని అన్నారు. ఇక విజయ్ కూడా వరంగల్లో ఫంక్షన్ పెడదామని అన్నారు. వారిద్దరూ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు అని అన్నారు.
ఛార్మీ మాట్లాడుతూ.. సినిమా ఇంత బాగుంటుందా? ఇంత భారీ ఎత్తున తీశారా? అని అందరూ అన్నారు. లొకేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా బాగున్నాయి. అన్నీ మరిచిపోయి క్లైమాక్స్‌ను చూస్తారు. మా చిత్రయూనిట్ ఎంతో కష్టపడటం వల్లే రొమాంటిక్ సినిమా ఇంత బాగా వచ్చింది. జునైద్ గారు ఎప్పుడంటే అప్పుడు వచ్చి పనిచేశారు. డీఓపీ నరేష్ ఎంతో సహనంగా ఉన్నారు. ఆర్ట్ డైరెక్టర్ జానీ మా ఫ్యామిలీ మెంబర్. ఆయన్ను ఏమీ అడిగినా ఇచ్చేస్తారు. ఒరిజినల్ బీచ్ కావాలన్నా, క్రియేటెడ్ బీచ్ కావాలన్నా ఇస్తారు. సునీల్ గారు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడు. అనిల్ అయితే ఆయన పనులన్నీ పక్కన పెట్టేశాడు. సినిమా కోసం పని చేశాడు. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ కేతిక గురించి అడిగారు. నటిగా ఈ సినిమా ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది. మనల్ని నెత్తి మీదపెట్టుకుని చూస్తారు. ఆకాష్ అద్భుతంగా నటించాడు. ఇది మా అందరికీ ఎంతో ముఖ్యమైన సినిమా. ఇది మాకు చావో రేవో అనే సినిమా ఉండేది. కానీ నిన్న అందరూ సినిమా గురించి మాట్లాడాక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంతలా సపోర్ట్ చేసిన మీడియాకు థ్యాంక్స్. సినిమాను ఇంతలా ప్రమోట్ చేసిన ప్రభాస్, విజయ్ దేవరకొండలకు థ్యాంక్స్ అని అన్నారు.