Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు రజినీకాంత్ స్ఫూర్తి - రొమాంటిక్ చూసి ఏడ్చేశాః ఆకాష్ పూరి

Advertiesment
Puri Jagannath
, మంగళవారం, 9 నవంబరు 2021 (16:15 IST)
Akash Puri, Bhaskar Bhatla, Sunil Kashyap etc
పూరీ జ‌గ‌న్నాథ్ కొడుకు ఆకాష్ పూరి క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా `రొమాంటిక్‌`. సినిమాలో క్లైమాక్స్ చూసి ఏడ్చానంటూ పేర్కొన్నారు. ఇటీవ‌లే విడుద‌లైన ఈ సినిమా విజ‌య‌యాత్ర ను వైజాగ్‌లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘నాకు రజినీకాంత్ గారు అంటే చాలా ఇష్టం. ఆయనే నాకు స్ఫూర్తి. మల్టీప్లెక్స్ నుంచి సింగిల్ స్క్రీన్ వరకు నన్ను అందరూ అంగీకరించే సినిమాలు చేయాలని ఉంది. కమర్షియల్, హ్యాపీ, ఫన్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తాను. నేను మొదటి సారి రొమాంటిక్ సినిమాలో క్లైమాక్స్ చూసి ఏడ్చాను.

నేనే నటించాను కదా? ఎందుకు ఏడ్చాను అని అనుకున్నాను. కానీ ఆ ఎమోషనల్ అలాంటిది. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ క‌థ‌ను నమ్మి చేశాం. క్లైమాక్స్‌లో నన్ను కొట్టే సీన్ నుంచి.. చివరి సీన్ వరకు అమ్మ ఏడుస్తూనే వచ్చింది. అంతా చూశాక.. ఇంత బాగా ఎలా నటించావ్‌రా అని అన్నారు. నా నటనను చూసి అమ్మ ఎంతో సంతోషించారు. నాన్న గారు చూసిన సక్సెస్‌లు వేరు. ఆయన స్థాయికి నేను వచ్చాక.. కాలర్ ఎగిరేస్తారు. అది ఒక్క హిట్‌తో వచ్చేది కాదు. ఆ స్థాయికి వచ్చే వరకు ఎంత కష్టమైన పడతాను’ అని అన్నారు.
 
గీత ర‌చ‌యిత‌ భాస్కర్ భట్ల మాట్లాడుతూ.. ‘ప్రతీ పాటను అద్భుతంగా తెర‌కెక్కించారు. నా వల్లే కాదే అనే పాట నాకు చాలా ఇష్టం. షూట్ చేశాక.. ఆ విజువల్స్ చూశాక ఆ పాటను అంత రొమాంటిక్‌గా రాశాను. మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ వల్లే ఈ పాటలు ఇంత బాగా వ‌చ్చాయి`` అన్నారు.
 
సంగీత ద‌ర్శ‌కుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ.. ‘నా వల్లే కాదే అనే పాటను మొదటగా కంపోజ్ చేశాం. ఆ తరువాత మూడేళ్లు మనం ప్రయాణం చేశాం. ప్రతీ రోజూ అద్భుతంగానే అనిపించింది. పూరి గారు, భాస్కర భట్ల గారి నుంచి తెలుగును నేర్చుకోవచ్చు. ఎంతో మంచి సాహిత్యాన్ని అందించారు. అన్ని పాటలు అద్భుతంగా వచ్చాయి. ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అయిందంటే దానికి ప్రేక్షకులే`` అని అన్నారు.
 
కేతిక శర్మ హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమాకు అనిల్ పాదూరి ద‌ర్శ‌కుడు. పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగార్రాజు కోసం పాట పాడిన నాగార్జున - మైసూర్‌లో కీల‌క షెడ్యూల్‌