Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉన్న ఒక్క ఎమ్మెల్యేను వైసీపీ లాక్కెళ్లిపోయింది, కానీ అమిత్ షా మాత్రం: పవన్ కళ్యాణ్

Advertiesment
ఉన్న ఒక్క ఎమ్మెల్యేను వైసీపీ లాక్కెళ్లిపోయింది, కానీ అమిత్ షా మాత్రం: పవన్ కళ్యాణ్
, ఆదివారం, 31 అక్టోబరు 2021 (20:33 IST)
విశాఖ: ఏపీ ఎంపీలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంఘీభావం తెలిపి బహిరంగ సభలో పాల్గొన్నారు. పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై ఎంపీలు ఎందుకు స్పందించరని మండిపడ్డారు.


రాష్ట్ర విభజన సమయంలోనూ ఏమాత్రం స్పందించలేదని చెప్పారు. ఓట్ల సమయంలో మాత్రమే కనిపిస్తారని విమర్శించారు. స్టీల్‌ ప్లాంట్‌కి భూములు ఇచ్చినవారికి ఇంతవరకు నష్టపరిహారం అందించలేదన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో వైసిపి సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వారం పాటు వేచి చూస్తామన్నారు. ఆ తర్వాత తమపోరాటం ఎలా వుంటుందో చూపిస్తామన్నారు.

 
ఇంకా ఆయన మాట్లాడుతూ...  ‘‘ఢిల్లీలో ఉన్నవాళ్లకి ఏం తెలుస్తుంది. 25 మంది ఎంపీలు విశాఖకు గనులు కావాలని ఎందుకు అడగలేదు. మనకు కులాలు, వర్గాలు మాత్రమే ముఖ్యమే. కరోనా సమయంలో దేశాన్ని ఆదుకున్న విశాఖ ఉక్కు. కేంద్ర ప్రభుత్వానికి చెప్పేముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలి. ఉన్న ఒక్క ఎమ్మెల్యేను వైసీపీ లాక్కెళ్లిపోయింది.


నా వెంట ప్రజలున్నారనే కేంద్ర మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇస్తున్నారు. నష్టాలు లేని వ్యాపారం అంటూ ఏదీలేదు. 18 వేల మంది రైతులు భూములు వదులకుంటే వచ్చింది విశాఖ ఉక్కు. 1971లో విశాఖ ఉక్కుకు శంకుస్థాపన, 1992లో జాతికి అంకితం.


నాటి నేతల రాజీనామాలతోనే ఉక్కు సంకల్పం సాధ్యమైంది. విశాఖ ఉక్కు కోసం 32 మంది యువకులు బలిదానం. కులాలు, వర్గాలకి అతీతమైన నినాదం విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు. మౌలిక సదుపాయల రంగానికి కీలకం ఉక్కు కర్మాగారం.’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకోవ‌డం పూర్వ‌జ‌న్మ సుకృతం: ప్ర‌ముఖ బాలివుడ్ న‌టీమ‌ణి, మిసెస్ ఇండియా వ‌ర‌ల్డ్ వైడ్ ఈస్ట్-2018 ఆకాంక్ష మంగ్లాని