Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులపై కేసు పెట్టిన తమిళ హీరో విజయ్

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (16:27 IST)
కోలీవుడ్ అగ్రహీరో విజయ్ తన తల్లిదండ్రులపై కేసు పెట్టారు. అలాగే, మరో 11 మందిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండానే తన పేరును వాడుకుంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు చెన్నై సిటీ సివిల్ కోర్టులో ఆయన ఓ పిటిషన్ దాఖలు చేసినట్టు ఆదివారం వెలుగులోకి వచ్చింది. 
 
ఇటీవల విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ ఓ పార్టీని స్థాపించారు. అయితే, ఈ పార్టీ ప్రచారం కోసం తన పేరును అనుమతి లేకుండా వాడుకుంటున్నారన్నది విజయ్ ఆరోపణ. తన తండ్రి చంద్రశేఖర్ స్థాపించిన పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. 
 
దీంతో తన తల్లిదండ్రులతో సహా మొత్తం 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనుమతి లేకుండా తన పేరును ఉపయోగిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇకముందూ తన పేరుతో ఎలాంటి కార్యక్రమాలు, మీటింగ్స్ నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 17వ తేదీన జరుగనుంది. 
 
కాగా, గత ఏడాది విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్​ఏ చంద్రశేఖర్ ‘ఆల్ ఇండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్’ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. దీనికి ఆయన ప్రధానకార్యదర్శిగాను, తల్లి శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా ఉన్నారు. మరికొంతమందికి ఇతర పదవులను అప్పగించారు. 
 
అయితే, పార్టీ పెట్టిన కొన్నిరోజులకే విజయ్ వైపు నుంచి ఓ ప్రకటన వచ్చింది. 'మా నాన్న పెట్టిన పార్టీతో నేరుగా, పరోక్షంగా గానీ నాకు సంబంధం లేదు. మా నాన్న పార్టీ పెట్టారని నా ఫ్యాన్స్ ఎవరూ అందులో చేరొద్దు' అని పేర్కొన్నారు. అలాగే, పార్టీ కోసం తన పేరు, ఫొటో, ఫ్యాన్స్​ క్లబ్​నుగానీ దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటానని కూడా విజయ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

Annadata Sukhibhava: ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం అమలు.. చంద్రబాబు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments