రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీలను తిరిగి ఏర్పాటు చేసేందుకు సెప్టెంబర్ 16న కమిటీ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయించింది.
నూతన కమిటీల ఏర్పాటు కోసం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రా జశేఖర్ ఉత్తర్వులిచ్చారు. సెప్టెంబర్ 16న రోజు మధ్యాహ్నం ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో ఓటర్ల జాబితాను ప్రదర్శి స్తారు.
20వ తేదీన ఉదయం వాటిపై అభ్యంతరాలు స్వీకరించి తుది ఓటరు జాబి తాలను ప్రదర్శిస్తారు. 22వ తేదీ ఉదయం పేరెంట్స్ కమిటీ సభ్యులను ఎంపిక చేసి కమిటీని పునర్నిర్మాణం చేస్తారు. మధ్యాహ్నం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది.