ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మండలంలో అయిన జడ్పీటీసీ,ఎంపీపీ రెండూ స్థానాలు అన్-రిజర్వుడ్ అయినచో ఒక స్థానాన్ని బీసీ, ఎస్సీ,ఎస్టీ లకు కేటాయించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో 50% బిసి,ఎస్సి,ఎస్టీలకు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ఇపుడు జడ్పీటీసీ,ఎంపీపీ లలో ఓ స్థానాన్ని బీసీ, ఎస్సీ,ఎస్టీ లకు ఇవ్వాలని స్వయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెద్దలకు సూచించారు.
ఇప్పటికే జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ముగిసింది.కానీ ఫలితాలు కోసం కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది.రాష్ట్రంలో చాలా జడ్పీటీసీ స్థానాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.మొత్తం ఫలితాలు వెలువడిన అనంతరం ఎంపీపీ ని ఎన్నుకోవాల్సి ఉంది.
ఈ క్రమంలో ఏకగ్రీవం అయిన జడ్పీటీసీ స్థానాన్ని ఇపుడు మార్చేందుకు వీలులేదు.ఎంపీపీ అభ్యర్థిని మార్చేందుకు ఆస్కారం ఉంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ఏ మండలంలో జడ్పీటీసీ,ఎంపీపీ
రెండూ అన్-రిజెర్వుడ్ ఉన్న చోట్ల ఎంపీపీ ని బీసీ, ఎస్సీ,ఎస్టీలకు కట్టబెట్టబోతోంది.