అన్ని భాషల్లో పాటలు పాడిన అరుదైన గాయకుడు బాలు గారు -సుమన్

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (14:40 IST)
లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇక లేరు. ఈరోజు మధ్యాహ్నం 1.04 నిమిషాలకు బాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కోట్లాది మంది ప్రార్థనలు చేసినప్పటికీ ఈ ప్రార్థనలు ఏమీ ఫలించలేదు. దేవుడు కరుణించలేదు. బాలు ఇక లేరు అనే వార్తను ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ మీడియాకి తెలియచేసారు. 
 
బాలు లేకపోవడం అనేది సంగీత ప్రపంచానికి తీరనిలోటు. బాలు లేరు అని తెలిసినప్పటి నుంచి తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ.. అనే కాకుండా భారతదేశంలోని సినీ ప్రముఖులు అందరూ తమ సంతాపాన్ని తెలియచేసారు.
 
ప్రముఖ సీనియర్ హీరో సుమన్ బాలు గురించి స్పందిస్తూ... నాకు బాలుగారు పాటలు పాడటమే కాదు డబ్బింగ్‌ కూడా చెప్పారు. నా కెరీర్‌ తమిళ చిత్రాలతో మొదలైంది. తమిళంలో నాకు బాలు గారు పాడారు. ఆ తర్వాత తెలుగు, కన్నడ భాషల్లో నటించాను. ఈ రెండు భాషల్లో కూడా బాలు గారు నాకు పాడారు. అలాగే నా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అన్నమయ్య చిత్రంలోని వెంకటేశ్వర స్వామి పాత్రకు ఆయనే డబ్బింగ్‌ చెప్పారు.
 
అలాగే శ్రీ రామదాసులోని రామునిగా నటించిన నాకు డబ్బింగ్‌ చెప్పారు. బాలు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటలు గుర్తుండిపోతాయి. అన్ని భాషల్లో పాటలు పాడిన అరుదైన గాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని చెప్పి బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సపోటా తోటలో మైనర్ బాలికపై తుని టీడీపీ లీడర్ అత్యాచారయత్నం

తమిళనాడులో భారీ వర్షాలు.. చెన్నైలో మూతపడిన పాఠశాలలు

రాష్ట్రపతికి తప్పిన పెనుముప్పు - బురదలో కూరుకుపోయిన హెలికాఫ్టర్

Mana Mitra App: మన మిత్ర మొబైల్ యాప్‌ను ప్రారంభించిన చంద్రబాబు

తొలిసారి భార్య భారతితో దీపావళి జరుపుకున్న వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments