రాజ్యం.. కొడుకు, కోడలు, పిల్లలతో మాట్లాడాలి. వారు కరోనాతో ఇబ్బంది పడుతున్నారు కదా. మనం నేరుగా వెళ్ళి చూడకపోయినా వారితో ఫోన్లో మాట్లాడుదాం. ఒక్కసారి ఫోన్ చేస్తావా అన్నారు. ఇప్పుడు సమయం తెల్లవారుజామున 3.30 నిద్ర లేచి ఉండరు.
ఆరు గంటలకు చేద్దామండి అని చెప్పాను. సరే నేను బాత్రూంకి వెళ్ళివస్తానన్నారు. అంతే అక్కడే చనిపోయారు. నేను డాక్టర్‌కి ఫోన్ చేశాను. ఆయన వచ్చారు. అమ్మా.. చనిపోయారు అని చెప్పారు. ఇంతకుముందు హృద్రోగ్ర సమస్య అయితే ఉండేది.
స్టంట్ కూడా వేయించారు. గత వారమే ఆసుపత్రికి వెళ్ళొచ్చాం. అంతా బాగుందని చెప్పారు. డాక్టర్ చాక్లెట్లు నవలమని చెప్పారు. అంతే, ఇంక బాగుంది వెళ్ళిపో అన్నారు. అలా ఇంటికి వచ్చేశాము. కానీ ఉన్నట్లుండి నా భర్త చనిపోతాడని అస్సలు నేను ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు జయప్రకాష్ రెడ్డి భార్య.