రోజురోజుకు మానవ సంబంధాలు దిగజారుతున్నాయి. కట్టుకున్న భర్తనే భార్య చంపేసింది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ లోని పి అండ్ టి కాలనీ... మేపల్ టౌన్ విల్లాలోని నెంబర్ 129లో ఈ దారుణం చోటుచేసుకుంది. భర్త విశాల్ దివానాను భార్య కత్తితో పొడిచి అతి దారుణంగా హత్య చేసింది.
భర్త అరుపులు విన్న స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గల కారణాలు కుటుంబ కలహాలే ఉండొచ్చని.. ఎంత కుటుంబకలహాలు ఉన్నా కూడా భర్తను ఇలా చంపడం చాలా దారుణమని అంటున్నారు స్థానికులు.
సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ సీఐ సురేష్, ఎస్సై బాలరాజు, ఎస్సై శ్వేతా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.