Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నన్ను పెళ్లి చేసుకుని.. నలుగురు అమ్మాయిలతో సహజీవనమా? భర్తకు దేహశుద్ధి చేసిన భార్య

Advertiesment
నన్ను పెళ్లి చేసుకుని.. నలుగురు అమ్మాయిలతో సహజీవనమా? భర్తకు దేహశుద్ధి చేసిన భార్య
, శనివారం, 5 సెప్టెంబరు 2020 (12:20 IST)
ఒకరితో పెళ్ళి… మరో న‌లుగురితో స‌హ‌జీవ‌నం చేసిన వ్యక్తికి భార్య, ఆమె కుటుంబ సభ్యులు తగిన బుద్ధి చెప్పారు. తాళి కట్టిన భార్యను వదిలేసి, మాయమాటలతో అమ్మాయిలను లైంగికంగా దోచుకుంటూ, వారి జీవితాలతో ఆటలాడుకుంటున్న ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌కు చెందిన సంపత్ అనే వ్యక్తి ఓ షాపింగ్ మాల్ లో పని చేస్తున్నాడు. 
 
తనతో పాటు పని చేసే మానకొండూరుకు చెందిన యువతిని ప్రేమించానని చెప్పి లైంగికంగా లొంగదీసుకుని ఆమెతో సుఖాలు అనుభవించాడు. ఆ యువతి ఒత్తిడి మేరకు తప్పనిసరి పరిస్ధితుల్లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైనా తన ప్రవర్తన మార్చుకోకుండా షాపింగ్ మాల్‌లో పనిచేసి ఇతర అమ్మాయిలతో చనువుగా ఉంటున్నాడు. వారిలో కొందరిని మాయమాటలతో లైంగికంగా లోబరుచుకున్నాడు.
 
ఈ విషయం  బయటపడటంతో అతడి భార్య గొడవపడి వెళ్లిపోయింది. దీంతో సంపత్ ఒక గది అద్దెకు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు. ఇప్పుడు అతని కామ కలాపాలకు అడ్డు చెప్పేవారు లేకపోవటంతో మరింత రెచ్చిపోయాడు. అవకాశం ఉన్న చోటల్లా అమ్మాయిలను లోబరుచుకుని తన కామ వాంఛలు తీర్చుకోవటం మొదలు పెట్టాడు. తనకు లొంగని వారిని లైంగికంగా వేదించడం మొదలెట్టాడు. 
 
భర్త నుంచి దూరంగావచ్చినప్పటికీ సంపత్ వ్యవహారాలన్నీ ఒక కంట కనిపెడుతున్న భార్య, బంధువులతో కలిసి గురువారం భర్త రూమ్ వద్దకు వచ్చింది.అపర కాళిలా మారింది. తనలాగా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావంటూ రోడ్డుమీదకు ఈడ్చుకొచ్చింది. అప్పటికే బయట వేచి చూస్తున్న ఆమె బంధువులు కూడా ఆమెతో కలిసి దేహశుధ్ధి చేశారు. అనంతరం ఆమె పోలీసు స్టేషన్‌కు వెళ్లి భర్త సంపత్ నిర్వాకాలపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బతకనివ్వట్లేదు.. అందుకే చనిపోతున్నాం.. టిక్ టాక్ ప్రేమ జంట