Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీ తెలుగులో 17న 'జీ సూపర్ ఫామిలీ' క్రేజీఎస్ట్ ఫ్యామిలీ షో

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (17:49 IST)
ఎప్పుడూ అందరిని ఆహ్లాదంగా ఉంచడానికి చూసే జీ తెలుగు, ఈ ఆదివారం నుంచి అందరికి మరిన్ని సంబరాలని అందివ్వడానికి 'జీ సూపర్ ఫామిలీ' అనే క్రేజీఎస్ట్ ఫ్యామిలీ షో తో తన అభిమానుల ముందరికి వస్తుంది ఈ ఏప్రిల్ 17 మధ్యాహ్నం 12 గంటలకు.

 
ప్రత్యేకతకి మరో పేరు జీ తెలుగు, అందుకే మెగా లాంచ్‌ని మరింత వైభవంగా మార్చడానికి డీజే టిల్లు ఫేమ్ సిద్దు మరియు నటుడు నిఖిల్ వారి మాతృమూర్తి తో షోకి విచ్చేశారు. సిద్ధూ తన సినిమా టైటిల్ సాంగ్ మీద డాన్స్ చేసి అందర్నీ అబ్బురపరిస్తే, నిఖిల్ 'వంద స్పీడ్లో వస్తున్న' అనే పాట మీద డాన్స్ చేసి అందరి ఉత్తేజాన్ని మరింత పెంచారు. ఈ షోకి ఇంకాస్త సంబరాన్ని అంటిస్తూ, తెలుగు వారి ఆడపడుచు సుమ కనకాల విచ్చేశారు. అంతేనా, తన మరియు జీ తెలుగు అభిమానుల కోసం ఒక రాప్ సాంగ్‌ని పాడి అందరిని ఆశ్చర్యపరిచారు.

 
ధారావాహికల మధ్య సాగే రసవత్తరమైన పోరులో దేవతలారా దీవించండి, రౌడీ గారి పెళ్ళాం, ముత్యమంత ముద్దు, ఊహలు గుసగుసలాడే, గుండమ్మ కథ, ఇంటి గుట్టు, మిఠాయి కొట్టు చిట్టెమ్మ, వైదేహి పరిణయం, కళ్యాణ వైభోగం, కృష్ణ తులసి, రాధమ్మ కూతురు, కళ్యాణం కమనీయం, నెంబర్ 1 కోడలు, త్రినయని, ప్రేమ ఎంత మధురం, అగ్నిపరీక్ష మరియు సూర్యకాంతం పాల్గొనగా, వారితో పాటు సూపర్ క్వీన్, సరిగమప - ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్, సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్స్ యొక్క పార్టిసిపంట్స్ కూడా పాల్గొంటున్నారు. అందరూ గెలుచుకోవాలని చూసేది 'జీ సూపర్ ఫామిలీ' యొక్క క్రేజీఎస్ట్ టైటిల్.

 
ఇంతటి ఘన షోకి యాంకర్‌గా ప్రదీప్ మాచిరాజు వ్యవహరించంగా, పార్టిసిపెంట్స్ స్ఫూర్తి, సహనం మరియు క్రేజీఎస్ట్ టైటిల్ గెలువాలనే పట్టుదల ఈ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చింది.. ఆపై కరెంట్ షాక్ కూడా.. బావతో కలిసి చంపేసింది..

తిరుపతిలో ఘోరం.. అనుమానం.. భార్య గొంతుకోసి చంపేసి.. ఆపై భర్త ఏం చేశాడంటే?

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments