Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అసలైన పేగుబంధానికి నిలువెత్తు సాక్ష్యం జీ తెలుగు వారి 'కళ్యాణం కమనీయం'

Advertiesment
అసలైన పేగుబంధానికి నిలువెత్తు సాక్ష్యం జీ తెలుగు వారి 'కళ్యాణం కమనీయం'
, సోమవారం, 24 జనవరి 2022 (23:04 IST)
అమ్మని మించి దైవం ఉన్నదా? అని పాటలలోనే కాదు నిజజీవితంలో కూడా ప్రతీఒక్కరు అనుకోకుండా ఉండరు. అమ్మ ఎవరు, తను ఎలా ఉంటుంది, తన ప్రేమెలా ఉంటుందో తెలియకుండా పెరిగితే ఆ జీవితం ఎలా ఉండబోతుంది? జీ తెలుగు ఎప్పుడు కూడా గుండెకు హత్తుకొనే కథలను తనదైన శైలిలో ప్రదర్శించడంలో ప్రఖ్యాతిగాంచింది.

 
అందుకే ఈసారి ఒక వైవిధ్యమైన ధారావాహికతో మన ముందుకి రాబోతుంది. అమ్మ కోసం అన్వేషిస్తున్న ఇద్దరి కూతుళ్ల కథ ఇది. తన పిల్లలని ఏనాటికైనా కలుసుకోవాలనుకునే ఒక అమ్మ వేదన ఈ కథ. అంతేనా, అమ్మ ప్రేమ ఎంత నిజమో, నిజమైన ప్రేమ కూడా అంతే అని చెప్పే జీ తెలుగు వారి సీరియల్-  ‘కళ్యాణం కమనీయం’. ఈ 31 జనవరి నుంచి రాత్రి 7:30 గంటలకు మీ అభిమాన ఛానెల్లో ప్రసారం కానుంది.

 
కథ విషయానికొస్తే, సీతారత్నం (హరిత) సాధారణ గృహిణి, ఒక శరణాలయాన్ని నడుపుతుంది. అందరు బాగుండాలని కోరుకొనే మనిషి. మరోవైపు చైత్ర (మేఘన లోకేష్), ఫీజియోథెరపిస్ట్. తన తండ్రి (సింగర్ మనో) ఆఖరి నిమిషంలో తనకు, తన చెల్లికి వారి అమ్మ గురించిన నిజాన్ని వెల్లడిస్తారు. అలా అమ్మ గురించి తెలుసుకున్న అక్కాచెల్లెళ్ళు అమ్మ ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో తెలీకుండానే వెతుకుంటూ ఉంటారు.

 
విధి ఆడిన వింత ఆట ద్వారా వీరు సీతారత్నం చెంతకి చేరుతారు. ఇది ఇలా ఉంటే, సీతారత్నం కోసం రాక్ స్టార్ విరాజ్ (మధు)కి ఎదురునిలబడుతుంది డాక్టర్ చైత్ర. రాక్ స్టార్, డాక్టర్ మధ్య వైరం తగ్గి ప్రేమ ఎలా మొదలవుతుంది? సీతారత్నం, తన పిల్లలు కలుసుకుంటారా? చైత్రకి తన అమ్మ దక్కుతుందా? తెలుసుకోవాలంటే - కళ్యాణం కమనీయం చూడాల్సిందే.

 
కొత్త సంవత్సరంలో అసలు తగ్గేదేలే అంటూ కొత్త షోస్, టెలివిజన్ ప్రీమియర్స్‌తో దూసుకుపోతున్న జీ తెలుగు, అదే ఊపులో భాగంగా ఇప్పుడు ‘కళ్యాణం కమనీయం’ అనే సీరియల్‌ని అందరి ముందుకి తీసుకురానుంది. సీనియర్ నటి హరిత రెండు ఏళ్ళ తర్వాత జీ తెలుగు ప్రేక్షకులని అలరించండానికి సీతారత్నం రూపంలో ముందుకి రాబోతుంది.

 
హరిత మాట్లాడుతూ,"నాకు పుట్టింటికి వచ్చినట్టుగా ఉంది. అఖిలాండేశ్వరి తర్వాత మన ఛానల్ అభిమానులకి సీతారత్నం   పాత్రలో కనిపించబోతున్నాను. తల్లి కోసం పిల్లల అన్వేషణ, తన పిల్లలు ఎక్కడ ఉన్నా బాగుండాలి, ఒక్కసారైనా వాళ్ళని కలవాలి, వాళ్ళని చూడాలనే ఒక తల్లి తపనే ఈ కథ. అందరికీ నచ్చుతుందని, సీతారత్నం పాత్రని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను."

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్మీ గౌతమ్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా?