Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ ఆదివారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జీ తెలుగు ‘షాదీ ముబారక్’ ప్రసారం

Advertiesment
ఈ ఆదివారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జీ తెలుగు ‘షాదీ ముబారక్’ ప్రసారం
, మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (18:08 IST)
ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో అందరినీ అలరించడానికి జీ తెలుగు ఈ ఆదివారం తన ప్రియమైన అభిమానుల కోసం సాగర్. కె నాయుడు నటించిన 'షాదీ ముబారక్‌' సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఏప్రిల్ 25 మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయనుంది. దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేయగా పద్మశ్రీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
 
మాధవ్ (సాగర్ కే నాయుడు) ఆస్ట్రేలియాలో నివశిస్తుంటాడు. అతడు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్‌ అయి, వధువును సెలక్ట్‌ చేసుకునే క్రమంలో హైదరాబాద్ వస్తాడు. అక్కడే ఓ మ్యారేజ్‌ బ్యూరోను ఆశ్రయించి తనకు ఎలాంటి అమ్మాయి కావాలో వివరాలు చెప్తాడు. ఈ క్రమంలో మ్యారేజ్‌ బ్యూరో ఓనర్ కూతురు అయిన తుపాకుల సత్యభామ (దృశ్య రఘునాథ్) పరిచయం అవుతుంది.
 
తన తల్లికి యాక్సిడెంట్ కావడంతో తానే బ్యూరో వ్యవహారాలు చూస్తున్న, ఆమె మాధవ్‌తో కలిసి పెళ్లి చూపులకు హాజరవుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న సత్యభామ - మాధవ్ ప్రేమలో పడతారు. మరి వారి ప్రేమ ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి పీటలు ఎక్కిందా? సత్యభామ- మాధవ్‌ ఒక్కటయ్యారా లేదా తెలియాలంటే షాదీ ముబారక్‌ చూడల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ పాజ‌టివ్‌తో మ‌న‌సునులోనిది బ‌య‌ట‌పెట్టిన‌ జ‌బ‌ర్‌ద‌స్త్ వ‌ర్ష‌