Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీ తెలుగులో 'సోలో బ్రతుకే సో బెటర్'ను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం

Advertiesment
జీ తెలుగులో 'సోలో బ్రతుకే సో బెటర్'ను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం
, మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (20:16 IST)
ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉండే జీ తెలుగు ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ఫిబ్రవరిలో తన ప్రేమను తనకి ఇష్టమైన ప్రేక్షకులపై కురిపించకుండా ఉంటుందా? అందుకే ఈ ఆదివారం మరో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌తో మన ముందుకు వస్తుంది జీ తెలుగు. ప్రేమకు ఒక కొత్త అర్ధాన్ని చెప్పిన 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమాతో ఈ ఆదివారం అంటే 21 ఫిబ్రవరి సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డిలలో ప్రసారం చేయనుంది.
 
యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్ తెరకెక్కించిన దర్శకుడు సుబ్బు కథ విషయానికి వస్తే.. విరాట్ (సాయి ధరమ్ తేజ్) ఇంజనీరింగ్ చదువుతూ ప్రేమ, పెళ్లి, ఫ్యామిలీ ఎమోషన్స్‌‌కి అస్సలు విలువ ఇవ్వడు. అసలు పెళ్లే వద్దంటూ.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ ఓ పుస్తకాన్ని రాయడమే కాకుండా పెళ్లి వద్దంటూ ఉపన్యాసాలు ఇస్తుంటాడు. కాలేజ్‌లో ఉద్యమాన్ని లేవనెత్తి ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఆర్గనైజేషన్ కి ఫౌండర్ అవుతాడు.
 
తన మామ (రావు రమేష్) ఇతన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. జీవితంలో పెళ్లే చేసుకోను అని డిసైడ్ అయిన కొంతమంది స్నేహితులతో కలిసి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లిన విరాట్‌కి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. స్నేహితులు ఒక్కొక్కరు పెళ్లి చేసుకుని దూరం అవుతారు. విరాట్ ఒంటరిగా మిగిలిపోతాడు. ఆ టైంలో విరాట్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అమృత (నభా నటేష్) విరాట్ జీవితంలోకి ఎలా వచ్చింది? అన్నదే మిగిలిన కథ. థమన్ మరోసారి తన మ్యూజిక్‌తో ఆకట్టుకోగా, వెంకట్ దిలీప్ సినిమాటోగ్రఫీ అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెసిఆర్, ప‌ద్యాలు పాడి బహుమతులు గెలుచుకున్నాడు, తెలియాలంటే..!