Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోటితో పాటు కండిషన్స్ అప్లై అంటున్న "ఉప్పెన" బేబమ్మ

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (09:03 IST)
"ఉప్పెన" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ కృతిశెట్టి. ఈ ఒక్క సినిమాతోనే ఆమె తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఒక్క తెలుగులోనే కాదు.. అటు కోలీవుడ్‌లో సైతం ఈ భామకు మూవీ ఆఫర్లు వస్తున్నాయి. దీంతో తన రెమ్యునరేషన్‌ను ఏకంగా రూ.60 లక్షలకు పెంచేసింది. ఇపుడు కోటి రూపాయలు కావాలంటోంది. దీంతోపాటు పలు రకాలైన కండిషన్లు పెడుతోంది. ఈ కండిషన్లు విన్న నిర్మాతలు షాకవుతున్నారు. 
 
మెగా మేనల్లుడువైష్ణ‌వ్ తేజ్‌, కృతిశెట్టి న‌టించిన "ఉప్పెన'' సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వంద‌ కోట్ల రూపాయ‌ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ మార్కును క్రియేట్ చేసింది. ఈ సినిమాలో బేబ‌మ్మ‌గా న‌టించిన కృతిశెట్టి తెలుగు ఆడియెన్స్‌ను త‌న క్యూట్‌లుక్స్‌తో ఫిదా చేసేసింది. దీంతో నిర్మాత‌లు కృతిశెట్టిని త‌మ సినిమాలో న‌టింప చేస్తే బావుంటుంద‌ని క్యూ క‌ట్టారు. 
 
తొలి సినిమాకు ఆరు ల‌క్ష‌లు.. అక్క‌డి నుంచి వెంట‌నే అర‌వై ల‌క్ష‌లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్న కృతిశెట్టి.. ఇప్పుడు ఏకంగా కోటి రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ అడుగుతుంద‌ట‌. రీసెంట్‌గా ఓ స్టార్ నిర్మాత త‌న సినిమాలో న‌టించాలంటూ కృతిశెట్టిని సంప్ర‌దించాడ‌ట‌. కృతిశెట్టి కోటి రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసింద‌ట‌. 
 
సరే! అని నిర్మాత అనుకున్నాడ‌ట‌. అయితే కృతి శెట్టి పెట్టిన కండీష‌న్స్ విని షాక్ అయ్యాడ‌ట‌. అస‌లు కంటే కొస‌రెక్కువ అయ్యేలా ఉందే అనుకుని స‌ద‌రు స్టార్ ప్రొడ్యూస‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై కృతిశెట్టి ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments