Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాలీవుడ్ హాట్ ఫేవరేట్ కృతి శెట్టికి ఆఫర్ల వెల్లువ... రూ.కోటిస్తే ఓకే అంటున్న బ్యూటీ!

Advertiesment
టాలీవుడ్ హాట్ ఫేవరేట్ కృతి శెట్టికి ఆఫర్ల వెల్లువ... రూ.కోటిస్తే ఓకే అంటున్న బ్యూటీ!
, ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (12:03 IST)
ఉప్పెన చిత్రంలో రాత్రిరాత్రి స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బ్యూటీ కృతిశెట్టి. మంగుళూరులో పుట్టిన ఈ కన్నడ బ్యూటీ.. పెరిగిందంతూ ముంబైలో. ప్ర‌స్తుతం ఓపెన్ యూనిర్శిటీలో సైకాల‌జీ చేస్తున్న ఈమె... టాలీవుడ్‌లో హాట్ ఫేవ‌రేట్ హీరోయిన్‌గా మారింది. 
 
మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ఉప్పెనలో ఛాన్స్ కొట్టేసిన కృతికి ఇపుడు వరుస ఆఫర్లు వస్తున్నాయి. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కాలేజీ గర్ల్ బేబమ్మ పాత్రలో కృతి తన అందమైన లుక్స్, అంత‌కు మించిన నటనతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని త‌న మాయలో ప‌డేసింది. 
 
ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నానితో క‌లిసి 'శ్యామ్ సింఘ‌రాయ్‌' చిత్రంలో న‌టిస్తున్న కృతికి టాలీవుడ్‌తో పాటు తమిళ చిత్రసీమలో కూడా ప్రసిద్ధ బ్యానర్ల నుండి క్రేజీ ఆఫర్లు వ‌స్తున్నాయి.
 
ఇలా వ‌రుస ఆఫ‌ర్ల కార‌ణంగా కృతి తన పారితోషికాన్నిభారీగా పెంచినట్లు చెబుతున్నారు. కోటి రూపాయలు డిమాండ్ చేస్తోంది. నానితో మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ట‌. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు శ్రీ‌కాంత్ దర్శకత్వం వహించనున్నారు. 
 
'విరాట పర్వం' నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌లో నిర్మించ‌బోతున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిన 'ఉప్పెన' రూ.50 కోట్ల క్లబ్ వైపు అడుగులు వేస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు కె.సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు నేనే పోటీ... ప్రేక్షకులకు బోర్ కొడుతుంది... రకుల్ ప్రీత్ సింగ్