జయసుధ. సహజనటిగా ఆమెకి సినీ ప్రేక్షక లోకం ఇచ్చిన కితాబు. ఆమె ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ఐతే 2017లో తన భర్త మరణించిన దగ్గర్నుంచి ఆమె వెండితెరపై కనిపించడం తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం తన కుమారులతో వుంటున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే... ప్రముఖ ఛానల్లో జానకి కలగనలేదు.. అనే టైటిల్తో ఓ సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు జయసుధ. అంతేగా.. అనుకునేరు.. ఐతే అలా బెస్ట్ విషెస్ చెప్పిన సమయంలో జయసుధ లుక్ డిఫరెంట్ గా కనబడింది.
నెరిసిన కేశాలతో పాలిపోయిన ముఖంతో కనబడ్డారు. కాస్తంత సన్నబడినట్లుగా కూడా అనిపించారు. దీనితో జయసుధ గారూ.. మీరు ఎందుకు అలా వున్నారంటూ కొందరు ప్రేక్షకులు ప్రశ్నలు సంధించారు. ఐతే కేశాలు తెల్లబడటం వల్ల ఆమె అలా కనిపిస్తున్నారా లేదంటే ఏమయినా సమస్యా అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.