''ఉప్పెన'' సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కృతి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో బేబమ్మగా ఒదిగిపోయి ప్రేక్షకుల మదిని గెలుచుకుంది కృతి.
ఈ సినిమా విడుదలకు ముందు నాని, సుధీర్ బాబు సినిమాల్లో ఆఫర్లు దక్కించుకున్న కృతి.. తాజాగా నాలుగో సినిమాను కూడా ప్రకటించింది. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి ఎంపిక అయినట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే వార్తలను నిజం చేసింది. కృతి రామ్ సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించింది. కాగా, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు.