అందరికీ ఆమే కావాలట...? పారితోషికం పెంచేస్తోందట...

టాలీవుడ్‌‌లో ఎప్పటినుంచో పెద్ద హీరోలను ఒక సమస్య వెంటాడుతోంది. ఒక వైపు వయస్సు పైబడటం, నటించడం తప్ప డ్యాన్స్‌లు వేయడం మరియు ఫైట్‌లు చేయడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఎంత మేకప్ వేసిన్నప్పటికీ హీరోయిన్‌తో కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించే

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (15:33 IST)
టాలీవుడ్‌‌లో ఎప్పటినుంచో పెద్ద హీరోలను ఒక సమస్య వెంటాడుతోంది. ఒక వైపు వయస్సు పైబడటం, నటించడం తప్ప డ్యాన్స్‌లు వేయడం మరియు ఫైట్‌లు చేయడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఎంత మేకప్ వేసిన్నప్పటికీ హీరోయిన్‌తో కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేటప్పుడు, డ్యాన్స్ వేసేటప్పుడు వయస్సు కొట్టొచ్చినట్లు కనబడుతోంది, దీంతో స్క్రీన్‌పై దాని ప్రభావం కనిపిస్తోంది. 
 
చిరంజీవి, బాలయ్య, నాగ్ మరియు వెంకటేష్ వంటి పెద్ద హీరోలు, వారి వయస్సుకు తగ్గ పాత్రలు చేయడం లేదు. ఇక మల్టీస్టారర్ల ఊసేలేదు. ఈ హీరోలందరూ ఇంకా కథానాయకులుగా చేస్తుండటంతో వారికి జోడీగా నటించేందుకు తగు వయస్సు హీరోయిన్‌లు దొరకడం లేదు. ఒకవేళ దొరికినా వారు కూతురు వయస్సు కంటే తక్కువ వయస్సు కలగిన వారే ఉంటున్నారు. అందుకే ఇప్పుడు కాస్త ముదురు హీరోయిన్‌లకు బాగా డిమాండ్ పెరిగింది. వారిలో ముందు వరుసలో ఉంది నయనతార. 
 
ఈమె తెలుగులో సినిమా కెరీర్‌ని ఇప్పటికీ నెట్టుకొస్తోందంటే దాని వెనుక ఈ హీరోల హస్తం ఎంత ఉందో ఇట్టే అర్థమౌతుంది. నయన చివరిగా తెలుగులో వెంకీతో బాబు బంగారం చిత్రంలో నటించింది. తాజాగా చిరంజీవి నటిస్తున్న సైరా నర్సింహారెడ్డి సినిమాలో ఈమె కథానాయికగా చేస్తోంది, బాలయ్య బాబుతో బోయపాటి చేయనున్న చిత్రంలో కూడా నటించనుందని సమాచారం. ఇప్పటికే మాయ, డోరా అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించిన నయనతార భవిష్యత్తులో కూడా అలాంటి సినిమాలు చేయడానికి సిద్ధమేనంటోంది. ఇప్పటికైతే పెద్ద హీరోల పుణ్యమా అని ఎలాగోలా ఆమె కెరీర్‌ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోందన్నమాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments