Webdunia - Bharat's app for daily news and videos

Install App

గల్లా జయదేవ్‌కు షాక్... జగనే ముఖ్యమంత్రి అంటున్న సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యమంగా మహేష్ బాబు బావ అయిన గల్లా జయదేవ్‌కు ఇది మరీ షాకింగే. ఇంతకీ విషయం ఏంటయా అంటే... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (15:22 IST)
సూపర్ స్టార్ కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యమంగా మహేష్ బాబు బావ అయిన గల్లా జయదేవ్‌కు ఇది మరీ షాకింగే. ఇంతకీ విషయం ఏంటయా అంటే... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని ఆయన వ్యాఖ్యానించడమే. 
 
జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు జనం భారీగా తరలి వస్తున్నారనీ, ఇలాంటి స్పందనే వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్రకు కూడా వచ్చిందని అన్నారు. జగన్ పాదయాత్ర చూస్తుంటే వైఎస్సార్ పాదయాత్రలా అనిపిస్తోందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డిలో కష్టపడే తత్వం, పట్టుదల వున్నాయనీ, అనుకున్నది సాధించే వరకూ విశ్రమించని నాయకుడు జగన్ అని పొగడ్తలు కురిపించారు. 
 
తకు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మంచి సంబంధాలు వుండేవనీ, తను ఎంపీగా ఉన్న సమయంలోనే వైఎస్సార్ కూడా ఎంపీగా వున్నారనీ, అప్పట్లో తామిద్దరం ఎన్నో విషయాలపై చర్చించుకునేవారమని గుర్తు చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు మహేష్ బాబుకు బావ అయిన గల్లా జయదేవ్ తెదేపా ఎంపీగా వున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments