Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూజా హెగ్దే అలా చేసినందుకే ఆఫర్లు వస్తున్నాయా?

సినిమా రంగంలో రోజురోజుకీ హీరోయిన్లు స్కిన్ షో చేయడం ఎక్కువైపోతోంది. గతంలో హీరోయిన్లు నిండుగా చీరలతో దర్శనమిచ్చేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. సినిమాలలో ప్రస్తుతం వారి పాత్ర నామమాత్రంగా మారింది, అంటే కేవలం స్కిన్ షోకి మాత్రమే వారు పరి

Advertiesment
పూజా హెగ్దే అలా చేసినందుకే ఆఫర్లు వస్తున్నాయా?
, మంగళవారం, 29 మే 2018 (19:59 IST)
సినిమా రంగంలో రోజురోజుకీ హీరోయిన్లు స్కిన్ షో చేయడం ఎక్కువైపోతోంది. గతంలో హీరోయిన్లు నిండుగా చీరలతో దర్శనమిచ్చేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. సినిమాలలో ప్రస్తుతం వారి పాత్ర నామమాత్రంగా మారింది, అంటే కేవలం స్కిన్ షోకి మాత్రమే వారు పరిమితమవుతున్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంది హీరోయిన్ 'పూజా హెగ్దే'. మొదటి సినిమా ముకుందాలో అచ్చం తెలుగమ్మాయిలా కనిపించి, ఒక లైలా కోసం చిత్రంలో కొంత మోడ్రన్ అమ్మాయిలాగా దర్శనమిచ్చింది. తరువాత హిందీలో హృతిక్‌తో చేసిన మొహెంజోదారో సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో మరోసారి తెలుగులో బన్నీతో కలిసి డీజే సినిమాలో నటించింది. 
 
ఈ సినిమాలో ఆమె బికినీ వేసి పరిమితికి మించి స్కిన్ షో చేయడంతో యువతను ఆకట్టుకున్నప్పటికీ, అది సినిమా ఫలితంపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక అవకాశాలు లేక విసిగిపోయిన ఈమె రామ్‌చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో ఐటెంసాంగ్‌లో సైతం జిగేలు రాణిగా చిందులు వేసింది. ఈ సినిమా కాస్త ఓ రేంజ్‌లో ఆడటంతో మరోసారి ఆమె కెరీర్ ఊపందుకుంది. ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్-ఎన్టీయార్ 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో, అలాగే మహేష్-వంశీ పైడిపల్లి సినిమాలలో హీరోయిన్‌గా నటించే అవకాశం కొట్టేసింది. 
 
అంతేకాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సాక్ష్యం అనే చిత్రంలో కూడా నటిస్తోంది. అందాల ఆరబోతకు తాను ఎప్పుడైనా సిద్ధమేనంటూ దర్శక నిర్మాతలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. ఈ భామ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నైజంతో ముందుకెళ్తోంది. ఈ ముద్దుగుమ్మకు మున్ముందు రాబోయే చిత్రాలు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడతాయని ఆశగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్ 'కాలా' కొనాలా? వామ్మో అంటున్న తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు???