అందరూ పాతవారిగానే కనిపిస్తున్నారంటున్న తమన్నా (video)

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (15:42 IST)
వరుస హిట్లతో తమన్నా తెలుగు, తమిళంలో దూసుకుపోతోంది. కాస్త గ్యాప్ వచ్చిన తరువాత తమన్నా నటించిన ఎఫ్..2 సినిమా భారీ విజయాన్నే సాధించింది. మళ్ళీ ఇప్పుడు మూడు సినిమాలను ఒప్పుకుని షూటింగ్‌లో బిజీగా ఉంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా.
 
సినిమా విజయం వచ్చినా నేను ఎప్పుడూ సంబరిపడిపోను. ఎందుకంటే నేను నటించిన మొదటి సినిమా హ్యాపీడేస్‌లో దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి కొన్ని మంచి విషయాలను నేను నేర్చుకున్నాను. లంగాఓణీలో విద్యార్థినిగా నా పర్మాన్మెన్స్‌ను దర్సకుడు శేఖర్ కమ్ముల బాగా మెచ్చుకున్నారు.
 
నేను ఆ సినిమా చేయగలనని ఆయనే నాకు ధైర్యం చెప్పారు. ఆ సినిమా తరువాత నేను ఏ విధంగా హీరోయిన్‌గా ఎదిగానన్నది ప్రతి ప్రేక్షకుడికి తెలుసు. అయితే నేను సినిమాలు వెంట వెంటనే చేయాలి. ఛాన్సులు వస్తూనే ఉండాలి. అస్సలు గ్యాప్ తీసుకోకూడదని ఎప్పుడూ అనుకోను. నాకు ఒక్కటే ఇష్టం.. స్నేహం. నాతో పాటు పనిచేసేవారందరూ కలిసికట్టుగా, కలివిడిగా ఉండాలనుకుంటాను నేను. దాని కోసమే నేనెప్పుడు ఆరాటపడుతుంటా. 
 
నేను షూటింగ్‌కు వెళ్ళినప్పుడు కూడా గ్యాప్ దొరికినప్పుడ బస్సులో వెళ్ళి కూర్చుండిపోను. నేరుగా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలోనే అందరితో మాట్లాడుతూ కూర్చుండిపోతాను. అందుకే నాకు షూటింగ్ జరుగుతున్న ప్రాంతాలు, మనుషులందరూ బాగా అలవాటైపోతారు. అందరూ పాతవారుగానే కనిపిస్తారంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రష్యా పర్యటనలో నారా లోకేష్.. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ ఆవిష్కరణలపై చర్చ

కర్నాటక ప్రజలపై సీఎం డీకే శివకుమార్ వరాల జల్లు

తిరువణ్ణామలై గిరిప్రదక్షిణలో మహిళను నగ్నంగా చేసి లైంగికదాడి...

మహిళను బెదిరించి అన్నాదమ్ముల అత్యాచారం

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం... రోగులను వదిలేసిన పారిపోయిన సిబ్బంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎంజీఎం మలర్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో అతి క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్

టీలో కల్తీని ఎలా గుర్తించాలి?

కొందరు వెల్లకిలా పడుకుంటే విపరీతంగా గురక పెడతారు, కారణం ఏంటి?

డ్రై బ్లాక్ కిస్‌మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్‌విఐసిసిఎఆర్

తర్వాతి కథనం
Show comments