Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగాస్టార్ - కొర‌టాల మూవీ తాజా వార్త‌... చెర్రీ నటిస్తున్నాడట...

Advertiesment
మెగాస్టార్ - కొర‌టాల మూవీ తాజా వార్త‌... చెర్రీ నటిస్తున్నాడట...
, గురువారం, 1 ఆగస్టు 2019 (21:53 IST)
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత చిరంజీవి బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. 
 
ఇదిలా ఉంటే... ఈ మూవీ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... చిరంజీవి రెండు పాత్ర‌ల్లో న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కాగా తాజా స‌మాచారం ప్ర‌కారం చిరంజీవి గోవింద్, ఆచార్య అనే రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. 
 
మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాలో కొంతభాగం ఉంటుంద‌ట‌. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ట‌. చిరు, చ‌ర‌ణ్‌ల పైన వ‌చ్చే సీన్స్ చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటాయ‌ట‌. చిరు పుట్టిన‌రోజైన ఆగ‌ష్టు 22న ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభం అవుతుంద‌ని, రెగ్యుల‌ర్ షూటింగ్ ద‌స‌రా త‌ర్వాత స్టార్ట్ చేస్తార‌ని తెలిసింది. ఇదే క‌నుక నిజ‌మైతే... ఇక మెగా అభిమానుల‌కు పండ‌గే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ అరెస్ట్‌కు రంగం సిద్ధం?