అలా చేసేందుకు భర్తను ఒప్పించిన ఆర్తీ అగర్వాల్ సినిమా చెల్లెలు సుదీప

సుదీప. 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో ఆర్తీ అగర్వాల్‌కు చెల్లెలు క్యారెక్టర్ చేసింది. వెంకటేష్‌ను వెంకటేశ్వర్లు అని పింకి ఏడిపిస్తుంటే ఆర్తి అగర్వాల్ పింకి ఈజ్ జస్ట్ వెంకీ అనే డైలాగ్ అప్పట్లో బాగా పాపులరైంది. మొదటగా సుదీప చైల్డ్ ఆర్టిస్టుగా ఎం.ధర్మరా

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (13:49 IST)
సుదీప. 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో ఆర్తీ అగర్వాల్‌కు చెల్లెలు క్యారెక్టర్ చేసింది. వెంకటేష్‌ను వెంకటేశ్వర్లు అని పింకి ఏడిపిస్తుంటే ఆర్తి అగర్వాల్ పింకి ఈజ్ జస్ట్ వెంకీ అనే డైలాగ్ అప్పట్లో బాగా పాపులరైంది. మొదటగా సుదీప చైల్డ్ ఆర్టిస్టుగా ఎం.ధర్మరాజు ఎం.ఎ. సినిమాలో ఎంటరైంది. మిస్టర్ ఫర్ఫెక్ట్‌లో ప్రభాస్ సిస్టర్ గాను, లెజెండ్‌లో బాలయ్య మరదలిగాను చేసింది.
 
అమర కావ్యం అనే తమిళ సినిమాలో నటించింది సుదీప. ఆ తరువాత శ్రీ రంగనాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక పాప కూడా పుట్టింది. ఆ తరువాత సినిమాలకు దూరమవుతూ అడపాదడపా సీరియళ్ళలో నటించడం ప్రారంభించింది. పెళ్ళయిన తరువాత ఎవరూ సినిమాల్లో అవకాశమివ్వకపోవడంతో ఇక సీరియళ్లే మంచిదన్న నిర్ణయానికి వచ్చేసిందట.
 
బొమ్మరిల్లు అనే టివి సీరియల్‌లో చెల్లెలుగా నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలా ఒక్కో సీరియల్లో నటిస్తూ వస్తోంది. మళ్ళీ అవకాశమొస్తే సినిమాల్లో నటించడానికి సిద్థంగా ఉన్నానంటోందట. భర్తను కూడా ఇదే విషయంపై ఒప్పించిందట. అయితే సుదీపకు అవకాశాలివ్వడానికి ప్రస్తుతం డైరెక్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదట. కారణం ఏంటో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పుకు సహకరించాలి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments