Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్" తర్వాత ఆ హీరోతోనే మూవీ చేస్తా : రాజమౌళి (video)

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (14:22 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్‌లు హీరోలుగా కాగా, బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, బ్రిటన్ నటి ఓలీవియా మోరిస్సాలు హీరోయిన్లు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే 75 శాతం మేరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా ప్లస్ లాక్‌డౌన్ కారణంగా షూటింగును నిలిపేశారు. 
 
అయితే, ఈ లాక్‌డౌన్ సమయంలో రాజమౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన మనసులోని భావాలను వెల్లడించారు. ముఖ్యంగా, ఆర్ఆర్ఆర్ తర్వాత చేసే మూవీలో ఎవరు ఉంటారన్న దానిపై సూచన ప్రాయంగా క్లారిటీ ఇచ్చారు. 
 
'డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక సినిమా, కేఎల్ నారాయణ నిర్మాతగా ఒక సినిమా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాను డీవీవీ దానయ్య నిర్మాణంలోనే చేస్తున్నాను. ఆ తరdవాత సినిమా కేఎల్ నారాయణ నిర్మాణంలో వుంటుంది. ఆ సినిమా ప్రభాస్‌తో కాదు. మహేశ్ బాబుతో ఉంటుంది. 
 
కేఎల్ నారాయణ నిర్మాణంలో మహేశ్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తానని చాలా కాలంగా చెబుతూ వస్తున్నాను. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది" అని రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. వాస్తవానికి ప్రభాస్‌తో రాజమౌళి మూడు చిత్రాలు తీశారు. ఇందులో ఒకటి 'ఛత్రపతి' కాగా, మిగిలిన రెండు చిత్రాలు 'బాహుబలి - ది బిగినింగ్', 'బాహుబలి - ది కంక్లూషన్' చిత్రాలు ఉన్నాయి. 
 
అలాగే, జూనియర్ ఎన్టీఆర్‌తోనూ మూడు చిత్రాలు నిర్మించారు. అందులో తొలి చిత్రం 'స్టూడెంట్ నంబర్ 1', రెండోది 'సింహాద్రి' కాగా, మరో చిత్రం 'యమదొంగ'. ఇక రామ్ చరణ్‌తో 'మగధీర' చిత్రాన్ని తీయగా, రవితేజతో 'విక్రమార్క', హాస్య నటుడు సునీల్‌తో 'మర్యాద రామన్న', హీరో నానితో 'ఈగ' వంటి చిత్రాలు చేశారు. మహేష్ బాబుతో రాజమౌళి చిత్రాన్ని నిర్మించలేదన్న వెలితి సినీ ప్రేక్షకుల్లో ఉండిపోయింది. ఇపుడు అది కూడా త్వరలోనే నెరవేరనుంది. అన్నీ అనుకున్నట్టు కుదిరితే వచ్చేయేడాది దసరాకు ఈ చిత్రం పట్టాలెక్కవచ్చని ఫిల్మ్ వర్గాల సమాచారం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments