Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

నడుము సుందరి ఇలియానాతో జల్సా చేయనున్న వకీల్ సాబ్‌

Advertiesment
Ileana
, గురువారం, 16 ఏప్రియల్ 2020 (16:51 IST)
pawan kalyan
వకీల్ సాబ్‌తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హిట్ పింక్‌ సినిమాకు ఇది రీమేక్ కానుంది. ఇందులో బిగ్ బీ అమితాబ్ నటించిన పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కి జంటగా శృతిహాసన్ నటించనుందనే వార్తలు వినిపించాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని.. ఇటీవలే ట్విట్టర్ వేదికగా శృతి క్లారిటీ ఇచ్చింది.  తాజాగా 'వకీల్ సాబ్'లో హీరోయిన్‌గా ఇలియానా ఎంపికైంది. 
 
కాగా 'వకీల్ సాబ్' సమ్మర్‌ను టార్గెట్ చేసుకుని మే 15న విడుదల కానున్నట్టు ప్రకటించారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ సినిమా విడుదల ఆగష్టులో పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ కూడా మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ చిత్రంతో పాటు క్రిష్ దర్శకత్వంలో ''విరూపాక్షి'' సినిమా చేస్తున్నాడు. 
 
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అనుష్క లేదా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. వీటితో బాబీ, డాలీ, వీటితో పాటు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మరో సినిమాకు కూడా సంతకం చేసినట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దర్శకత్వానికి స్వస్తి చెప్తానని అంటున్న డాషింగ్ డైరెక్టర్!