జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్, ఆయన అన్న నాగబాబును లక్ష్యంగా చేసుకుని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చిరంజీవిగారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొగవంటూ విమర్శించారు.
ఇటీవల ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా తన ఇంటికి పొత్తు కోసం వచ్చారంటూ జనసేన పార్టీ నేత నాగబాబు తన ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. వీటికి విజయసాయిరెడ్డి ధీటుగా కౌంటరిచ్చారు.
సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికి వదిలేసినవాళ్లకు రాజకీయాలెందుకు అంటూ ప్రశ్నించారు. 2014లోనే తాము పొత్తులు పెట్టుకోలేదని, పొత్తులుండవని పార్టీ అధినేత జగన్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. చిరంజీవిగారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవని విమర్శించారు. పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చిందంటూ ఎద్దేవా చేశారు.
'చంద్రబాబు కోసం ప్యాకేజి తీసుకుని పుట్టిన పార్టీ అది. రిజిస్టర్ చేసినప్పటి నుంచి ఎవరి కోసం తోక ఊపుతూ మాట్లాడాడో ప్రజలందరికీ తెలుసు. అలాంటి పార్టీతో మేం పొత్తు పెట్టుకుంటామని కలేమైనా కన్నారా? పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల చిత్తుగా ఓడిపోతాడని అందరికీ ముందే తెలుసు' అంటూ ట్విట్టర్ వేదికగా ఘాటైన విమర్శలు చేసారు.