Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి - కొరటాల శివ ఆచార్య స్టోరీ ఇదే..!

Advertiesment
చిరంజీవి - కొరటాల శివ ఆచార్య స్టోరీ ఇదే..!
, శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (20:28 IST)
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. మిర్చి, శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను... ఇలా కొరటాల తెరకెక్కించిన అన్ని సినిమాలు బ్లాక్‌బ‌ష్ట‌ర్ అవ్వ‌డంతో మెగాస్టార్‌తో చేస్తున్న సినిమాపై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే.. ఈ మూవీ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా క‌థ ఏంటి..?  చిరును కొర‌టాల ఎలా చూపించ‌నున్నారు..? అనేది ఆస‌క్తిగా మారింది.
 
దీనికి తోడు ఇందులో చిరుతో పాటు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా నటిస్తున్నాడని.. అది కూడా కీలక పాత్ర అని తెలియడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. అయితే... ఈ మూవీ స్టోరీ గురించి గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు చిరంజీవి ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి ఆచార్య కథ గురించి స్పందిస్తూ... ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. 
 
ఇంతకీ చిరు ఏం చెప్పారంటే... ఇది సోషియో పొలిటికల్ థ్రిల్లర్ అని.. ఇందులో సమాజానికి మంచి సందేశం ఉందన్నారు. సెన్సిబుల్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా కథ ప్రతి ఒక్కరిని కదిలిస్తుందన్నారు. అంతేకాకుండా... ప్రకృతి వనరులను కాపాడే ఓ వ్యక్తి పోరాటంగా ఈ చిత్రం ఉంటుందన్నారు.
 
 చిరంజీవి ఈ సినిమా గురించి ఒక్కొ ఇంట్రస్టింగ్ పాయింట్‌ని రివీల్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై రోజురోజుకు మరింత ఆసక్తి ఏర్పడుతుంది. ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంటే... చరణ్ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. చిరు, చరణ్ ఇందులో గురుశిష్యులుగా నటిస్తున్నారు. వీరిద్దరిపై చిత్రీకరించే సన్నివేశాలు ప్రేక్షకాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయని కొరటాల టీమ్ చెబుతున్నారు.
 
ఈ సినిమాని ఆగష్టులో రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ప్రస్తుతం షూటింగ్‌కి బ్రేక్ పడటంతో.. దసరాకి కాకుండా వచ్చే సంవత్సరంలో ఆచార్యను రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆచార్య రిలీజ్ డేట్ గురించి చిరు, కొరటాల అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారని తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోషల్ మీడియాలో సన్నీ యాక్టివ్.. డైపర్ మాస్క్.. అదిరే డ్యాన్స్