Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ జ‌న్మ‌కిది ఇది చాలు: మెగా దంప‌తుల ప‌రామ‌ర్శ‌పై రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి స్పంద‌న‌

Advertiesment
ఈ జ‌న్మ‌కిది ఇది చాలు: మెగా దంప‌తుల ప‌రామ‌ర్శ‌పై రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి స్పంద‌న‌
, సోమవారం, 13 ఏప్రియల్ 2020 (17:19 IST)
గుంటూరు జిల్లాకు చెందిన మెగా అభిమాని రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి అనే మహిళకు స్టార్ హాస్పిట‌ల్‌లో మేజ‌ర్ స‌ర్జ‌రీ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో మెగాస్టార్ చిరంజీవి ఆమెకు ఎంత‌గానో స‌హ‌కారం అందించారు. కాగా సోమ‌వారం  రాజనాల నాగలక్ష్మి గారిని స్టార్ హాస్ప‌టిట‌ల్స్ వారు ఆమెను ఐసీయూ నుంచి  ప్ర‌త్యేక గ‌దికి త‌ర‌లించారు. 
 
ఈ సందర్భంగా డాక్ట‌ర్లు ఆమె ఆరోగ్యం బాగుంద‌ని తెలిపారు. అలాగే రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి స్పృహలోకి రాగానే చిరంజీవి,  శ్రీమతి సురేఖ స్వయంగా నాగలక్ష్మిని వీడియో కాల్ ద్వారా తన ఆరోగ్య యోగ క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా చిరంజీవి దంప‌తులు మాట్లాడుతూ... మీకు ఏమీ కాద‌ని, మీకు మేము ఉన్నామంటూ ధైర్యం చెప్పారు. అనంత‌రం నాగ‌ల‌క్ష్మి మాట్లాడుతూ, `ఇది క‌లా..నిజ‌మా? నా న‌డిచే దైవం శ్రీ చిరంజీవి గారు స్వ‌యంగా నాతో మాట్లాడ‌ట‌మా? దీన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమ‌తి సురేఖ గారు కూడా కుంటుంబ స‌భ్యురాలిగా నాతో ఎంతో ప్ర‌ేమ‌తో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ జ‌న్మ‌కి ఇది చాలు. 
 
ముక్కోటి దేవ‌త‌లు చిరంజీవి గారిని.. వారి కుటుంబాన్ని చ‌ల్ల‌గా చూడాల‌ని, మ‌న‌స్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాని ఉద్వేగంతో, ఆనంద బాష్పాల‌తో మెగా దంప‌తుల ప‌రామ‌ర్శ‌కి బ‌దులిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇటలీలో కరోనా దెయ్యం.. రాత్రుల్లో తిరుగుతుందట.. ఎలా వుంటుందంటే?