Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోగా నువ్వైతేనే బాగుంటావ్ బ్రో... సమంత: ఎవరు?

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (21:53 IST)
పెళ్ళయిన తరువాత కూడా హీరోయిన్ సమంతకు అవకాశాలు తన్నుకువస్తున్నాయి. సమంత నటించిన సినిమాలు భారీ విజయం దిశగా దూసుకువెళుతున్నాయి. ఒక సినిమా చేస్తుండగానే, ఆ సినిమా పూర్తి కాకుండానే వరుసగా ఆఫర్లు వస్తున్నాయి సమంతకు. అంతేకాదు సమంత అడిగినంత డబ్బులు ఇచ్చి సినిమా తీసేందుకు సిద్థంగా ఉన్నారు నిర్మాతలు. అయితే అలాంటి సమంతకు ఈ మధ్యకాలంలో ఒక సినిమా కథ నచ్చింది. ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం ఒక హీరో వెంట సమంత పడిందని తెలుగు సినీపరిశ్రమలో ప్రచారం జరుగుతోంది.
 
ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. నాగశౌర్య. ఈ యువ హీరో గురించి చెప్పనక్కర్లేదు. సినీ పరిశ్రమలో నాగశౌర్యకు ఒక ప్రత్యేకస్థానం ఉంది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఒక మంచి పేరును సంపాదించుకున్నా నాగశౌర్య. సమంతతో కలిసి ఒక సినిమా చేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు దర్సకురాలు నందినీ రెడ్డి. ఈ సినిమాలో ఒక రోల్ కీలకంగా ఉండబోతోంది. అది కూడా అందమైన హీరో కావాలి. దీంతో ఎవరిని తీసుకుందామని ఆలోచనలో ఉన్న సమయంలో సమంత దర్సకురాలు నందినికి ఒక ఐడియా ఇచ్చింది. 
 
హీరో నాగశౌర్యను తీసుకుంటే బాగుంటుందని, ఈ క్యారెక్టర్ అతనికైతే సరిగ్గా సరిపోతుందని చెప్పింది. దీంతో అతన్ని ఒప్పించే బాధ్యత నువ్వే తీసుకోవాలంటూ దర్శకురాలు నందిని సమంతను కోరిందట. దీంతో నాగశౌర్యతో.. బ్రదర్ మా సినిమాలో నటించమంటూ కోరిందట సమంత. సమంత లాంటి టాప్ హీరోయిన్ అడిగితే ఏ హీరో అయినా వద్దంటారా. అలాగే సిస్టర్ నటిస్తానంటూ ఒప్పుకున్నాడట నాగశౌర్య. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతోంది.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments