Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదే ప్రశ్న నీ కూతురు అడిగితే ఏం చేస్తావ్? క్యాస్టింగ్ కౌచ్ పైన సమంత ఫైర్

Advertiesment
అదే ప్రశ్న నీ కూతురు అడిగితే ఏం చేస్తావ్? క్యాస్టింగ్ కౌచ్ పైన సమంత ఫైర్
, గురువారం, 11 అక్టోబరు 2018 (20:53 IST)
అక్కినేని సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటుందన్న సంగతి తెలిసిందే. ఎవరైనా వెకిలి ప్రశ్నలు వేస్తే సమాధానం మామూలుగా ఇవ్వదు. అలాంటి ప్రశ్నలు వేసినవారు ఇక ట్వీట్ చేయాలంటేనే భయపడుతారు. ఐతే అదే సమయంలో తన అభిమానుల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవడం చేస్తుంటుంది. ఇటీవల మీ టూ ఉద్యమానికి సమంత కూడా మద్దతు తెలిపింది. ముఖ్యంగా గాయని చిన్మయి శ్రీపాదకు ఆమె సపోర్టు తెలుపుతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
 
సమంత అలా మద్దతు తెలుపడంపై కొంతమంది నెటిజన్లు తేడాగా ట్వీట్లు పెట్టారు. ఎప్పుడో పది సంవత్సరాల క్రితం జరిగిన్న దాన్ని ఇప్పుడు చెప్పడంలో అర్థమేంటి? జరిగినప్పుడే చెప్పవచ్చు కదా అని ఒక నెటిజన్ ప్రశ్న సంధించాడు. దానిపై సమంత స్పందిస్తూ... మాకున్న భయం కూడా అదేనండీ. తప్పంతా మాదేనని మీరెక్కడ అంటారోనన్న భయంతో అప్పుడప్పుడు చెప్తుంటాం అని సమాధానిమిచ్చింది. 
 
ఇంతలో ఓ నెటిజన్ అందుకుని... తన కుమారుడు మీ టూ అంటే ఏంటని ప్రశ్నించాడనీ, అది ఆడవారి రిటైర్మెంటుకు సంబంధించినదని చెప్పానని ట్వీటాడు. అంతేకాకుండా...ఆడవాళ్లు అన్ని విషయాల్లో తలదూరుస్తారనీ, కెరీర్‌ ముగిశాక దాన్ని వాడుకుంటారనీ, ఇక పాత్రికేయులకు పని బాగా కలుగుతుందని చెప్పానని అనడంతో సమంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అదే ప్రశ్న నీ కూతురు అడిగితే ఏం చెబుతావ్? అంటూ మండిపడింది. దాంతో సదరు నెటిజన్ సైలెంట్ అయిపోయాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ బయోపిక్ : జయప్రదగా మిల్కీబ్యూటి