త్రివిక్రమ్ - చెర్రీ కాంబినేషన్‌లో మూవీ?

ఠాగూర్
బుధవారం, 28 మే 2025 (14:05 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం చెర్రీ యువ దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో "పెద్ది" చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇది 2026 మార్చి 27వ తేదీన విడుదలకానుది. ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ - చెర్రీ కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో ఒక సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన ఉంది. ఈ మూవీతో పాటే త్రివిక్రమ్ సినిమా కూడా పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్.. విక్టరీ వెంకటేష్‌తో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. దీని తర్వాత చెర్రీ సినిమాను ప్లాన్ చేసినట్టు సమాచారం. వచ్చే యేడాది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మూవీ పట్టాలెక్కనున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభంగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు చెర్రీ సైతం సమ్మతం తెలిపినట్టు వినికిడి. 
 
ఇకపోతే, ఈ మెగా కాంబోపై అధికారిక ప్రకటన కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, రామ్ చరణ్ నటన కలగలిసి ఒక అద్భుతమైన సినిమా వస్తుందని సినీ ప్రియులు ఆశిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ ఇకలేరు

దూసుకొస్తున్న మొంథా : కాకినాడ పోర్టులో ఏడో ప్రమాద హెచ్చరిక

మొంథా తుపాను.. అప్రమత్తమైన తెలంగాణ.. రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు

Kavitha: కొత్త మేకోవర్‌లో కనిపించిన కల్వకుంట్ల కవిత

Cyclone Montha: మొంథా తుఫాను.. ఏపీ రౌండప్.. సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments