విశ్వనటుడు కమల్ హాసన్ హాసన్ వయుసు ఏడు పదులు. హీరోయిన్ త్రిష వయసు నాలుగు పదులు దాటింది. అయితే, 'థగ్ లైఫ్' కోసం వీరిద్దరూ రొమాన్స్ చేశారు. మణిరత్నం దర్శకత్వంలో కమల్, త్రిష నటించిన చిత్రం 'థగ్ లైఫ్'. జూన్ 5వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోయిన్ త్రిషతో రొమాన్స్ చేశారు.
అలాగే మరో హీరోయిన్ అభిరామి నటించారు. కమల్, అభిరామి కలిసి నటించిన విరుమాండి చిత్రం ఘన విజయం సాధించింది. చాలాకాలం తర్వాత కమల్, అభిరామి కలిసి నటిస్తున్నారు. అయితే, తనకంటే 28 సంవత్సరాలు చిన్నదైన అభిరామికి కమల్ లిప్ లాక్ కిస్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
అదేసమయంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, దర్శకుడు మణిరత్నంకు ఓ ప్రశ్న ఎదురైంది. నిజ జీవితంలోనూ అలాంటి వ్యక్తులు ఉంటారు. పురుషులు, మహిళలు ఎవరైనా తమకంటే చిన్నవారితో లేదా పెద్దవారితో రిలేషన్‌షిప్‌లో ఉంటారు. అది జీవిత సత్యం. ఇలాంటి బంధాలు ఇపుడు పుట్టినవి కావు. ఎంతో కాలం నుంచి ఉన్నాయి. సినిమాల విషయానికొస్తే ఏదైనా విషయంపై తప్పు ఎత్తి చూపడం లేదా అభిప్రాయాన్ని తెలియజేస్తాం. అదే సమయంలో మీరు దాన్ని సమర్థించవచ్చు. లేకపోతే, సమాజంలో కళ్ల ముందు జరిగే వాటికి ఎలాగైతే మౌనంగా ఉంటున్నారో అలాగే కళ్ళు మూసుకుని చూడొచ్చు. ఒక సన్నివేశంలో ఇద్దరు వ్యక్తుల మధ్య బంధాన్ని చూస్తున్నపుడు వాళ్లు కమల్ హాసన్, త్రిషలా చూడరాదు. అవి వారు పోషించిన పాత్రలు అని గుర్తుపెట్టుకోవాలి అని స్పష్టంగా చెప్పారు.