Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ "సలార్‌"లో ప్రియాంకా చోప్రా ఐటమ్ సాంగ్?

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (17:02 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేపట్టిన ప్రాజెక్టుల్లో సలార్ ఒకటి. ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ విషయాన్ని ప్రకటించిన రోజు నుంచే ఎంతో క్రేజ్‌ సంపాదించుకుంది. ఇపుడు ఓ సరికొత్త అప్‌డేట్‌ ప్రస్తుతం అందర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ మేరకు ‘సలార్‌’ కోసం గ్లోబల్‌స్టార్‌ ప్రియాంకా చోప్రా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
 
ఇటు బాలీవుడ్‌లోనే కాకుండా, అంటు హాలీవుడ్‌లో సైతం ప్రియాంక్ చోప్రా రాణిస్తోంది. ఈ క్రమంలోనే ‘సలార్‌’పై బాలీవుడ్‌ ప్రేక్షకుల చూపు పడేలా చేసేందుకు ప్రియాంకా చోప్రాను రంగంలోకి దించాలని సదరు చిత్రబృందం భావిస్తోందట. 
 
ఈ మేరకు ప్రియాంక ‘సలార్‌’లో ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడనున్నారంటూ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే, సదరు వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 
 
మరోవైపు ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. తొమ్మిదేళ్ల తర్వాత ఓ టాలీవుడ్‌ నటుడు సరసన ప్రియాంక నటించిన చిత్రమిదే అవుతుంది. రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘జంజీర్‌’లో ప్రియాంక నటించిన విషయం తెలిసిందే. ఇక, ‘సలార్‌’ షూట్‌ ప్రస్తుతం గోదావరిఖనిలో జరుగుతోంది. ఈ సినిమాలో నటి శ్రుతిహాసన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు : నోటీసులిచ్చిన పోలీసులు

ఆత్మార్పణ చేసుకుంటే దేవుడుకి దగ్గరవుతాం... స్వర్గం ప్రాప్తిస్తుందంటూ మహిళ ఆత్మహత్య

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments