Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పండుగ‌నాడు చిందులేసిన భానుచంద‌ర్‌, సుహాసిని..

Advertiesment
bhanu chander
, శుక్రవారం, 15 జనవరి 2021 (12:19 IST)
Suhasini_BhanuChander
తెలుగు లోగిళ్లలో కళా కాంతులు, సంతోషాలు నింపే  పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి ,కనుమ , ముక్కనుమ ఇలా నాలుగు రోజుల పాటు జరుపుకోవడం మనందరి ఆనవాయితీ. హరిలో రంగ హరి..’ అనే భక్త హరిదాసులు కీర్తనలు. రంగురంగుల రంగవల్లులు. రుచికరమైన పిండి వంటలు.. ఎగిరే పతంగులు..కోడి పందేలు.. పండుగ వేళ ఎక్కడ చూసినా ఇవే మనకు అగుపిస్తాయి. 
 
పంటలు చేతికొచ్చి.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రాకతో ప్రతి ఇంటి లోగిళ్లన్నీ కళకళలాడుతున్నాయి.అలాంటి అందరికి ఇష్టమైన సంక్రాంతి విశిష్టతను తెలియచేసెలా ఓ ప్రత్యేక గీతాన్ని "మన సంక్రాంతి 2021"  పేరిట గ్రీన్ మెట్రో ఇన్ ప్రా టెక్ అండ్ ప్రాజెక్ట్స్  ప్రై లిమిటెడ్ చైర్మన్ శ్రీ బొడ్డు అశోక్ నిర్మించారు. 
 
తాజాగా క్రేజీ అంకుల్స్ సినిమా సెట్‌లో సింగర్ మనో, పాపులర్ యాంకర్ మరియు నటి శ్రీముఖి, రాజా రవీంద్ర  చేతుల మీదగా ఈ పాటను ఆవిష్కరించారు.శ్రేయాస్ మీడియా యూట్యూబ్ చానెల్ ద్వారా  ఈ పాట విడదలయి, నెటిజెన్స్‌ను ఆకట్టుకుంటోంది.
 
ప్రముఖ నటీనటులు సుహాసిని ,భానుచందర్ లపై  కలర్ ఫుల్‌గా రూపొందించిన ఈ పాటకు ఫేమస్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ అర్థవంతమైన సాహిత్యాన్ని అందించగా  భోలో షావలి, అంజనా సౌమ్య గీతాన్ని ఆలపించారు. సంక్రాంతి  సందండినంతా నింపుకున్న ఈ  పాట ముందుగానే పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. 
webdunia
Sushasini
 
సుహాసిని మణిరత్నం,భానుచందర్, అక్షిత, శ్రీతిక్ బాబువ, పరమేష్ తదితరులు నటించిన ఈ పాటకు సాహిత్యం: కాసర్ల శ్రామ్, సింగర్స్ : భోలే షావలి, అంజనా సౌమ్య, ప్రోగ్రామింగ్- మిక్సింగ్: మదన్ ఎస్.కె, డిఓపి - ఎడిటింగ్-డిఐ : జనతా బాబు, కొరియోగ్రఫీ : దుర్గేష్, టోని కిక్, రఘుజాన్, డ్రోన్ : సురేష్ డెగవత్, 
పిఆర్ఓ : సాయి సతీష్
సంగీతం -కాన్సెప్ట్ - దర్శకత్వం : భోలే షావలి
నిర్మాత : శ్రీ బొడ్డు అశోక్
(గ్రీన్ మెట్రో ఇన్ ప్రా టెక్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రై లిమిటెడ్ చైర్మన్ ).

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాఫ్ స్టోరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!!