Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయవాడలో సంక్రాంతి.... సంబరాలు... సరదాలు

విజయవాడలో సంక్రాంతి.... సంబరాలు... సరదాలు
, బుధవారం, 13 జనవరి 2021 (19:43 IST)
పండుగలు తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీకలను అలాంటి పండుగలను అనంత్ డైమండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ లేబర్ కమీషర్ జి.రేఖారాణి అన్నారు. బృందావన్ కాలనీలోని అనంత్ డైమండ్స్ ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించారు. రేఖారాణి ముఖ్య అతిధిగా హజరై సంబరాలను తిలకించారు. 
 
ఈ సందర్భంగా రేఖారాణి మాట్లాడుతూ తెలుగు వారి పండుగల్లో సంక్రాంతి ముఖ్యమైన పండుగ అన్నారు. చిన్నారులకు రేగి పళ్ళు పోయడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. వైభవంగా సంబరాలు... నిత్యం వాహనాల రాకపోకలు, వాటి సైరన్ల మోతలతో దద్దరిల్లే బృందావన్ కాలనీ మొయిన్ రోడ్డు సంక్రాంతి సంబరాల సందర్భంగా సోమవారం హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు,రంగుల రంగవల్లులతో అందంగా ముస్తాబైంది. 
 
కొండపల్లి బొమ్మల కొలువు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ రోడ్డు పరిసరాలను సంప్రదాయ పూలతో అందంగా అలంకరించారు. తెలుగు వారి సంస్కృతిని ప్రతిబింబిచేలా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. అనంత్ డైమండ్స్ అధినేతలు జాస్తి వెంకట భాను ప్రకాష్, జాస్తి అనంత పద్మ శేఖర్‌లు మాట్లాడుతూ తెలుగు వారి సంప్రదాయాలను ఎంతో గొప్పవన్నారు. తెలుగు వారి పండుగల గొప్ప తనాన్ని పెద్దలు పిల్లలకు తెలియజేయాలని సూచించారు. పండుగల వెనుక ఉన్న గొప్ప పరమార్థాన్ని పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత పెద్దలు, తల్లిదండ్రులదేనన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్‌తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందా?