Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉద్యోగం మానేసినా ఇంటికొచ్చేశాడు, సార్... ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అని చెప్పినా...

Advertiesment
Company MD
, సోమవారం, 4 జనవరి 2021 (20:52 IST)
మహిళలను వేధిస్తే కఠినంగా శిక్షిస్తారనే చట్టాలు వున్నప్పటికీ కామాంధులకు అదురూ బెదురూ వుండటంలేదు. ఒంటరిగా మహిళ కనబడితే వారి పట్ల తమ వికృత చేష్టలు చూపిస్తున్నారు. అత్యాచారాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
విజయవాడలోని హెచ్‌బి కాలనీకి చెందిన ఓ మహిళ తన భర్తతో మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడిపోయి ఓ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఐతే ఆమెపై ఆ సంస్థ ఎమ్‌డి కన్నేసాడు. ఆమె పట్ల సన్నిహితంగా వుండేందుకు ప్రయత్నించాడు. ఆమె దూరం పెట్టడంతో ఎలాగైనా ఆమెను లొంగదీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.
 
అతడి వేధింపులు తట్టుకోలేని ఆ మహిళ ఉద్యోగం మానేసింది. ఉద్యోగం వదిలేసి వెళ్లినా కామాంధుడు మాత్రం వదల్లేదు. ఆమె ఫోనుకి అసభ్య సందేశాలను పంపుతూ, ఫోన్లో అసభ్యమైన పదజాలంతో వేధించడం మొదలుపెట్టాడు. దీనితో బాధితురాలు ఫోన్ తీయడం మానేసింది. దీంతో అతడు నేరుగా ఇంటికే వచ్చేసాడు.
 
మొన్న ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోకి ప్రవేశించి ఆమె చీరను లాగుతూ దారుణంగా ప్రవర్తించాడు. ఆ కామాంధుడి నుంచి తప్పించుకున్న బాధితురాలు అతడిపై విజయవాడ భవానీపురం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఐతే సదరు కామాంధుడు పలుకుబడి ఉపయోగించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. అతడిని కఠినంగా శిక్షించాలనీ, అతడి వల్ల తనకు ముప్పు వుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2020వ సంవత్సరంలో ఒకే అతిథి 128 సార్లు ఓయో హోటల్స్‌లో ఆతిథ్యం పొందారు