Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2020వ సంవత్సరంలో ఒకే అతిథి 128 సార్లు ఓయో హోటల్స్‌లో ఆతిథ్యం పొందారు

2020వ సంవత్సరంలో ఒకే అతిథి 128 సార్లు ఓయో హోటల్స్‌లో ఆతిథ్యం పొందారు
, సోమవారం, 4 జనవరి 2021 (20:18 IST)
ప్రపంచంలో అగ్రశ్రేణి ఆతిథ్యరంగ గొలుసుకట్టు సంస్థ ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ తమ మూడవ వార్షిక ట్రావెల్‌ ఇండెక్స్-  ఓయో ట్రావెలోపిడియా 2020ను నేడు విడుదల చేసింది. ఈ ఇండెక్స్‌ వెల్లడించే దానిప్రకారం, 2020వ సంవత్సరం ఉత్సాహంగానే ఆరంభమై 2020లో అత్యధికంగా ప్రయాణాలు జరిగిన నెలగా నిలిస్తే, ఏప్రిల్‌ 2020 అత్యధిక క్యాన్సిలేషన్స్‌ జరిగిన నెలగా నిలిచింది.
 
అంతర్జాతీయంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాలలో ఒకటిగా ఆతిథ్యరంగం నిలిచినప్పటికీ, ఓయోకు మాత్రం అత్యధికంగా బుకింగ్స్‌ జరిగిన దేశంగా ఇండియా నిలిచింది. 2020లో అత్యధికంగా బుకింగ్స్‌ జరిగిన నగరాలలో ఢిల్లీ నిలిస్తే, వ్యాపార పర్యాటకుల కోసం అగ్రశ్రేణి మూడు నగరాలలో ఒకటిగా హైదరాబాద్‌ నిలిచింది. అదే రీతిలో భారతదేశంలో అత్యధికంగా సందర్శించిన మూడు రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణా నిలిచింది.
 
ఒకే యూజర్‌ 2020వ సంవత్సరంలో ఓయో హోటల్స్‌లో 128 సార్లు ఆతిథ్యం పొందడం ద్వారా  ఈ బ్రాండ్‌ పట్ల తన విశ్వాసాన్ని వ్యక్తీకరించారు. మరో ఓయో వినియోగదారుడు 50వేల సెకన్లను ఓయో యాప్‌పై గడిపారు. ఆసక్తికరంగా షాజహాన్‌పూర్‌తో పాటుగా చెన్నైలోని ఓయో హోటల్స్‌లో 100% ఆక్యుపెన్సీ లాక్‌డౌన్‌ నాటి నుంచి కూడా కనిపించింది.
 
ఓయో యొక్క ట్రావెలోపిడియా2020లో కనుగొన్న అంశాలు:
 
ఓయో వెబ్‌సైట్‌, యాప్‌పై దాదాపు 8.5 మిలియన్‌ నూతన యూజర్‌ బుకింగ్స్‌ 2020లో జరిగాయి.
 
భారతదేశపు అత్యున్నత భక్తి కేంద్రంగా పూరి నిలిస్తే , అనుసరించి బృందావన్‌, తిరుపతి, షిర్డీ, వారణాసి ఉన్నాయి.
 
బీచ్‌ కేంద్రాల పరంగా గోవా తన స్థానం నిలుపుకుంటే అనుసరించి కొచి, వైజాగ్‌, పాండిశ్చేరి ఉన్నాయి.
 
హెరిటేజ్‌ నగరాలుగా జైపూర్‌, ఉదయ్‌పూర్‌, ఆగ్రాలను అధికశాతం మంది భారతీయులు ప్రేమిస్తున్నారు.
 
రోహిత్‌ కపూర్‌, సీఈవో, ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌, ఇండియా అండ్‌ సౌత్‌ ఆసియా మాట్లాడుతూ, ‘‘మనమంతా కూడా కొన్ని వందల సార్లు ‘జాగ్రత్తగా వెళ్లి రండి’ అనే మాటలను విని ఉంటాం కానీ వాటికి అసలైన విలువను ఇప్పుడు తెలుసుకుని, ప్రపంచమంతా ఆచరిస్తుంది. ఓయో యొక్క ట్రావెలోపిడియా అధ్యయనంతో మరోమారు భారతీయులు పయనించడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడైంది. 2021వ సంవత్సరం తనంతట తానుగా నూతన అభ్యాసంగా ఉంటుంది. ఆతిథ్య మరియు పర్యాటక రంగంలో మేము తీసుకువచ్చిన మార్పులు నూతన ప్రమాణాలు ఏర్పరచడంతో పాటుగా వినియోగదారులందరికీ సురక్షిత వసతులను అందించడానికి మాకు స్ఫూర్తినందిస్తుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసోసియేట్ జడ్జిగా భారత-అమెరికన్ న్యాయవాది విజయ్ శంకర్‌ను ప్రతిపాదించిన ట్రంప్