Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా హెగ్డే కోసం క్యూ కడుతున్న టాలీవుడ్ హీరోలు!

Webdunia
ఆదివారం, 10 మే 2020 (12:38 IST)
మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం 'ముకుంద'. ఈ చిత్రంలో ముద్దుగా కనిపించిన బాలీవుడ్ భామ పూజా హెగ్డే. ఆ తర్వాత 'ఒక లైలా కోసం' అనే చిత్రంలో నటించి, "దువ్వాడ జగన్నాథం'లో దుమ్మురేపింది. ఆ తర్వాత "మహర్షి"తో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుని అమూల్యగా "అలా వైకుంఠపురము''లో చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల మనుస్సులో చెరగని ముద్రవేసుకుంది. అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అలా, ఈ అమ్మడు పట్టిందల్లా బంగారంగా మారిపోయింది. దీంతో టాలీవుడ్ హీరోలు ఈ అమ్మడు వెనుకపడుతున్నారు. అంటే.. తమ కొత్త ప్రాజెక్టుల్లో పూజాను బుక్ చేసుకునేందుకు క్యూ కడుతున్నారు. 
 
సౌత్ మూవీ ఇండస్ట్రీలో ఈమె చేసింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ.. మంచి లక్కున్న హీరోయిన్‌గా గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమెకు తాజాగా ఓ ప్రశ్న ఎదురుకాగా దీనికి కఇలా సమాధానమిచ్చింది. తాను లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడానికి సిద్ధమే కానీ అది ఇప్పుడే కాదంటుంది. 'అలాంటి పాత్రలు చేయడం నాకూ ఇష్టమే. ఒక నటిగా నన్ను మరో కోణంలో అది చూపిస్తుంది. ఓ సినిమా వచ్చింది కానీ, నాకు నచ్చక చేయలేదు. నాకు నచ్చి చేయగలను అనిపిస్తే చేయడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. 
 
అయితే అలాంటి సినిమాలు చేయడానికి ఇంకా సమయముంది. కొంత వయస్సు అయిపోయిన తరువాత అప్పుడూ లవర్ పాత్రలు చేయలేను. లవర్‌ పాత్రలు, గ్లామర్‌ పాత్రలు ఇప్పుడు మాత్రమే చేయగలను. అందుకే సీరియస్‌ పాత్రల వైపు ఇప్పుడప్పుడే దృష్టి పెట్టదలుచుకోలేదు. అయినా నేను చేసే సినిమాల్లో నాకు ఎంతో కొంత ప్రాధాన్యత ఉంటుంది అనుకుంటూనే చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments