Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుట్టబొమ్మ కరోనా చిట్కాలు.. వీడియో మొత్తం తెలుగులోనే..!

Advertiesment
Corona virus
, మంగళవారం, 5 మే 2020 (10:11 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో కరోనాను నిర్మూలించేందుకు చిట్కాలు చెప్తోంది. లాక్ డౌన్ కారణంగా సెలెబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు వర్కౌట్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. తాజాగా పూజా హగ్డే కూడా ఓ వీడియోను పోస్టు చేసింది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చిట్కాలు చెప్పింది. 
 
ఇంకా ఈ వీడియో తెలుగులో వుండటం ప్రత్యేకం. తెలుగు ప్రజలకోసం ప్రత్యేకించి రూపొందించిన ఈ వీడియోలో ఈ బుట్టబొమ్మ స్పష్టమైన తెలుగులోనే మాట్లాడటం మరో విశేషం. ''హాయ్ నేను మీ పూజా హెగ్డే. తెలుగు ప్రజలు అందరికీ నమస్కారం. ఇప్పుడు కంటికి కనిపించని శత్రువు కరోనాతో మనమంతా యుద్ధం చేస్తున్నాం. ఇందులో విజయం సాధించాలంటే ఇంట్లోనే ఉండాలి. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు వెళ్లవద్దు.
 
ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్, గ్లవ్స్ ధరించండి. చేతులకు సానిటైజర్ రాసుకోండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇంట్లోనే ఉండండి, భద్రంగా ఉండండి'' అంటూ పూజా పేర్కొన్నారు. 
 
ఇక టాలీవుడ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా కొనసాగున్న పూజా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌, అఖిల్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌కుమార్‌ సినిమాల్లో నటించనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుధీర్ కోసం రష్మీని బుక్ చేసిన నిర్మాత శేఖర్ రాజు?!