Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవికి షాకిచ్చిన తెలుగువాడైన తమిళ దర్శకుడు??

Webdunia
బుధవారం, 12 మే 2021 (12:31 IST)
మెగాస్టార్ చిరంజీవిని దర్శకత్వం చేసే అవకాశం వస్తే యువ దర్శకులు ఎగిరిగంతేస్తారు. అలాంటిది తెలుగువాడైన ఓ తమిళ దర్శకుడు ఆ అవకాశాన్ని వదులుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఛాన్స్ టాలీవుడ్ దర్శకుడు వివి.వినాయక్‌కు చేరినట్టు సమాచారం. 
 
అసలేం జరిగిందో తెలుసుకుందాం.. ప్రస్తుతం చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో ఆచార్య చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ మరో పది పదిహేను రోజుల ఉందనగా, కరోనా కారణంగా ఈ సినిమా షూటింగు వాయిదా పడింది. వచ్చేనెలలో ఆ కాస్త షూటింగును పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 
 
ఆ తర్వాత చిరంజీవి 'లూసిఫర్' రీమేక్‌లో చేయనున్నారు. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన 'లూసిఫర్' అక్కడ ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఇది రొటీన్‌కి భిన్నమైన సినిమాగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అందువలన ఆ సినిమా రీమేక్‌లో చేయాలని చిరూ భావించారు.
 
ఈ సినిమా రీమేక్ బాధ్యతలను తమిళ దర్శకుడు, తెలుగు నిర్మాత ఎడిటర్ మోహన్ కుమారుడు మోహన్ రాజాకి అప్పగించారు. కొంతకాలంగా తెలుగు నేటివిటీకి తగిన మార్పులు జరుగుతూ వస్తున్నాయి. అయితే వాటి విషయంలో చిరంజీవి అసంతృప్తిగానే ఉన్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. 
 
తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి మోహన్ రాజా తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందుకు గల కారణమేమిటనేది మాత్రం తెలియదు. మోహన్ రాజా తప్పుకోవడం నిజమే అయితే, ఈ ప్రాజెక్టు వినాయక్ చేతికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments