Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేసిన సాయం చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంటుంది... అమితాబ్

Webdunia
బుధవారం, 12 మే 2021 (12:12 IST)
దేశ ప్రజలంతా కష్టాల్లో ఉన్నప్పటికీ వారిని ఆదుకునేందుకు సినీ సెలెబ్రిటీలు ఏమాత్రం ముందుకు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. వీటిపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. 
 
ఢిల్లీలోని కొవిడ్ సెంటర్‌కు తాను 2 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు చర్చ జరిగిందన్న అమితాబ్.. చేసిన సాయాన్ని చెప్పుకోవడం తనకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. అయినా విమర్శల నేపథ్యంలో చెప్పక తప్పడం లేదన్నారు. కరోనా బాధితుల సహాయార్థం తాను ఇప్పటివరకు చేసిన సాయం మొత్తం విలువ రూ.15 కోట్ల వరకు ఉంటుందని వివరించారు. 
 
ఇప్పటివరకు తానేం చేసినదీ కూడా అమితాబ్ చెప్పుకొచ్చారు. ముంబై జుహూలో 25-50 పడకల కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు నిధులు ఇచ్చానని, ఫ్రంట్లైన్ వర్కర్లకు పీపీఈ కిట్లు, మాస్కులు అందజేశానని వివరించారు. ముంబై ఆసుపత్రికి ఎంఆర్ఐ యంత్రం, సోనో గ్రాఫిక్, స్కానింగ్ పరికరాలను సమకూర్చినట్టు చెప్పారు. 
 
ఎంతోమంది పేద రైతులను ఆదుకున్నానని, ఇంత పెద్ద సాయం తనకు కష్టమైనా సరే ఆనందంగా చేశానని అమితాబ్ వివరించారు. అలాగే, 20 వెంటిలేటర్ల కోసం విదేశీ కంపెనీలకు ఆర్డర్ ఇచ్చానని, వాటిలో ఇప్పటికే పది అందుబాటులోకి వచ్చాయని అమితాబ్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments