Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న 'పుష్ప'రాజ్

Webdunia
బుధవారం, 12 మే 2021 (11:49 IST)
ఇటీవల కరోనా వైరస్ బారినపడిన టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇపుడు ఆ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చింది.
 
రెండు వారాల క్రితం అల్లు అర్జున్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి క్వారంటైన్‌లో ఉంటూ ఆయ‌న చికిత్స తీసుకున్నాడు. త‌న‌కు నెగెటివ్ నిర్ధార‌ణ అయిందంటూ బ‌న్నీ ఈ రోజు ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపాడు.  
 
"ప్రతి ఒక్క‌రికీ హాయ్‌.. 15 రోజుల క్వారంటైన్ తర్వాత నాకు క‌రోనా నెగెటివ్ నిర్ధార‌ణ అయింది. నేను కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేసిన‌ నా శ్రేయోభిలాషుల‌కు, అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు. క‌రోనా కేసులు త‌గ్గ‌డానికి ఈ లాక్‌డౌన్ ఉపయోగ‌ప‌డుతుంద‌ని ఆశిస్తున్నాను. అంద‌రూ సుర‌క్షితంగా ఇంట్లోనే ఉండండి. మీరు చూపిస్తోన్న ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు" అని బ‌న్నీ ట్వీట్ చేశాడు.  
 
కాగా, దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా, ప్రతినాయకుడిగా ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు. 
 
ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగుకు అంతరాయం ఏర్పడటంతో, దసరాకి విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారనే టాక్ కూడా వచ్చింది.
 
ఈ సినిమా నిడివి ఎక్కువగా వస్తుందని భావించిన సుకుమార్, రెండు భాగాలు చేసి విడుదల చేద్దామని నిర్మాతలతో చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అందుకు వాళ్లు అంగీకరించినట్టుగా కూడా చెప్పుకున్నారు. 
 
కానీ అలా చేస్తారా? అనే సందేహం అభిమానుల్లో ఉంది. కానీ ఇది నిజమేననే విషయాన్ని నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ చెప్పారు. సుకుమార్ .. బన్నీ అంతా చర్చించే ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పారు. అయితే ముందుగా లీక్ అయిన విషయం ప్రకారం దసరాకి ఒక భాగం .. వచ్చే వేసవి సెలవుల్లో ఒక భాగం వస్తాయేమోయ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రంథాలయం- నారా లోకేష్

వంగవీటి మోహన రంగా విగ్రహాలపై అలా చేస్తారా? చంద్రబాబు సీరియస్

SVSN Varma: పవన్ కల్యాణ్‌కు పిఠాపురం ఇచ్చిన వర్మ.. చంద్రబాబు కలిసి కనిపించారే!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments