Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా యోగా క్లాసులు

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా యోగా క్లాసులు
, గురువారం, 6 మే 2021 (16:51 IST)
Swmi naidu and others
ఆగ‌స్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ కాస్ పోగ్రామ్ ను మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ &  టాటా సంస్థ వారు చేపడుతున్నారు. అందరికి యోగ అనేది ముఖ్యం కావున ప్రతి ఒక్కరు ఆన్ లైన్ లో యోగ గురించి క్లాసులు తెలుసుకోవాలని ఈ కార్యక్రమంలో తెలిపారు.
 
రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు స్వామి నాయుడు గారు మాట్లాడుతూ,  యోగ గురించి అందరికి అవగాహన కల్పిస్తున్న జయరామిరెడ్డి గారికి, అడ్వైజర్ శ్రీధర్ గారికి ప్రేత్యేక కృతజ్ఞతలు. మెగా అభిమానులకు స్వాగతం. చిరంజీవి గారు స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ .ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి రక్త దానం అందుతుంది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఎటువంటి డోనేషన్ తీసుకోకుండా నడుతుపున్న సంస్థ ఇది. ఆగస్ట్ 22.న చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపబోతున్నాము.  ఈ ఏడాది చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా యోగ వాలంటీర్ సర్టీపీకేషన్ ప్రోగ్రామ్ చేపట్టడం సంతోషంగా ఉంది. ప్రతిఒక్కరు ఈ ఆన్ లైన్ యోగ క్లాస్ లో ఇన్వాల్వ్ అయ్యి సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నాను. 
 
అడ్వైజర్ శ్రీధర్ గారు మాట్లాడుతూ, చిరంజీవి గారు, చరణ్ గారి అభిమానుల సమక్షంలో యోగ ఫర్ ఆల్ - డు యోగ ఇన్ రైట్ టైమ్ అనే ప్రోగ్రాం చెయ్యడం సంతోషంగా ఉంది. ఆన్ లైన్ లో ఈ యోగ క్లాసుల్లో పాల్గొనాలంటే... www.certyoga.com వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. 
రామ్ చరణ్ రాష్ట్ర యువశక్తి ప్రెసిడెంట్  శివ చెర్రీ మాట్లాడుతూ.. ఈ కరోనా టైం లో ప్రజల్లో యోగ గురించి చైతన్యం తెచ్చే ఈ కార్యక్రమం  మా మెగాఫ్యాన్స్  కు లభించటం చాలా సంతోషం గా ఉంది. స్వామి నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు .ఇంకా ఈకార్యక్రమంలో జయరామి రెడ్డి .టాటా సంస్థ ప్రతినిది శ్రీ చైతన్య వర్మ. అడ్వజయిర్ శ్రీధర్ . రవణం స్వామి నాయుడు. శివ చెర్రీ. మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసలు మీరు మనుషులేనా? మీకు దణ్ణం పెడుతున్నా, ప్లీజ్: ఆర్.పి. పట్నాయక్