Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప‌ద్మ అవార్డ్ ఇస్తే పరిశ్రమకు దక్కే గౌరమవుతుందిః చిరంజీవి

Advertiesment
ప‌ద్మ అవార్డ్ ఇస్తే పరిశ్రమకు దక్కే గౌరమవుతుందిః చిరంజీవి
, మంగళవారం, 4 మే 2021 (17:23 IST)
chiru- dasari
దివంగ‌త దర్శకరత్న దాసరి నారాయణరావుగారి విజయాలు, చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ స్మరణీయమే. సుమారు 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు ఆయన. ఈరోజు ఆ మహనీయుడి 74వ జయంతి. ఈ సందర్బంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను స్మరించుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి దాసరిగారిని గుర్తుచేసుకున్నారు.
 
విజయాలలో ఒకదాన్ని మించి మరో చిత్రాన్ని అపూర్వ దర్శకత్వ ప్రతిభతో మలచడమే కాదు.. నిరంతరం చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మార్గదర్శకమేనన్న చిరు అలాంటి గొప్ప వ్యక్తికి ప్రభుత్వం నుండి తగిన గుర్తింపు రాకపోవడం ఒక తీరని లోటని, ఇప్పటికైనా ఆయనకు విశిష్టమైన పద్మ పురస్కారం దక్కితే అది మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కే గౌరమవుతుందని అన్నారు.
 
webdunia
Dasari nivali
దాసరికి ఘన నివాళులు
 
దర్శకరత్న స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని... ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలోని ఆయన విగ్రహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. 'మా అధ్యక్షులు వి.కె.నరేష్, ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కొరియోగ్రఫర్ సత్య మాస్టర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్నదానం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాకినీ- ఢాకినీలు ఏం చేస్తారు!