Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాకినీ- ఢాకినీలు ఏం చేస్తారు!

Advertiesment
Regina
niveda, regina
స్వామిరారా ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ తాజాగా ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. దానికి మూలం ఓ కొరియ‌న్ మూవీ ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’. టైటిల్ ను బ‌ట్టే అర్థ‌మ‌యివుంటుంది గ‌దా. అర్థ‌రాత్రి జ‌రిగే ఓ సంఘ‌ట‌న ఆధారంగా దీన్ని తెలుగు నేటివిటీకి అనువదించారు. ఇందులో రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. సైలెంట్‌గా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఫిలింఛాంబ‌ర్‌లో శాకినీ- ఢాకినీ’ అనే టైటిల్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సునీత తాటి, డి. సురేష్ బాబు నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రం పూర్తి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నుంద‌ని తెలుస్తోంది. పిశాలాలను పిలుపుకునే శాకినీ డాకినీల పేర్లు వీరికి ఎందుకు పెట్టార‌నేది ఆస‌క్తిక‌రమ‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్ప‌టికే షూటింగ్ ముగింపుకు వచ్చింద‌ట‌. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేయాల్సి వుండ‌గా క‌రోనావ‌ల్ల వాయిదా ప‌డ్డాయి. క‌నుక ఈ సినిమాను ఈఏడాది చివ‌ర్లో విడుద‌ల చేసే ఛాన్స్ వుంద‌ని స‌మాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

60 మిలియన్ వ్యూస్ తో రికార్డు `పుష్ప` ఇంట్రడక్షన్ వీడియో