Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ని జరిగిపోతున్నాయ్ కదా... త్వరలో చెబుతాం : పెళ్లిపై మలైకా కామెంట్స్

Webdunia
సోమవారం, 4 మే 2020 (14:35 IST)
బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా. ఈమె బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్ఫాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 19 యేళ్లపాటు వైవాహిక జీవితాన్ని గడిపారు. ఫలితంగా వీరికి 17 యేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడిపోయారు. అర్ఫాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత మలైకా అరోరా బాలీవుడ్ యువ నటుడు అర్జున్ కపూర్‌తో ప్రేమలోపడింది. ఆ తర్వాత వీరిద్దరూ ఏకంగా సహజీవనం చేస్తున్నారు. ఈ ప్రేమ పక్షులు విదేశీ పర్యటనలు, ఫంక్షన్లకు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. 
 
ప్రస్తుతం లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోనే ఈ ప్రేమ జంట గడుపుతోంది. ఈ నేపథ్యంలో మలైకా అరోరా చిట్‌చాట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా అర్జున్ కపూర్‌తో పెళ్లి వ్యవహారం ఏంటని ప్రశ్నించగా ఆమె ఏమాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చింది. 
 
'పెళ్లిదేముంది.. ఏదో ఒక సమయంలో నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలుసు. పరిస్థితులు అనుకూలిస్తే త్వరగానే మా నిర్ణయం చెబుతాం. అప్పటివరకు ఏదీ చెప్పలేన'ని మలైకా తెలిపింది. ఇక, పిల్లల గురించి అడిగిన ప్రశ్నకు మలైకా సమాధానం ఇవ్వలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్!!

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments