Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాక్‌తో పని లేకుండా బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్న 'స్పైడర్'

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మించిన చిత్రం స్పైడర్. ఈ చిత్రం ఈనెల 27వ తేదీన విడుదలై నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రం టాక

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2017 (06:13 IST)
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మించిన చిత్రం స్పైడర్. ఈ చిత్రం ఈనెల 27వ తేదీన విడుదలై నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రం టాక్ ఎలా ఉన్నప్పటికీ భారీ వసూళ్లను సాధిస్తోంది. సినిమా విడుదలైన కాసేపటికే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ... కలెక్షన్లలో మాత్రం 'స్పైడర్' ఏ మాత్రం తగ్గలేదు. 
 
తొలి రోజున ఏకంగా రూ. 51 కోట్లను కలెక్ట్ చేసినట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. రెండో రోజు కూడా ఈ సినిమా ఇదే జోరును ప్రదర్శించింది. సెకండ్ డే రూ.34 కోట్లను వసూలు చేసిందని... తొలి రెండు రోజుల్లో రూ.85 కోట్లను కలెక్ట్ చేసిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు తెలిపాడు. ఈ వీకెండ్‌లో 100 కోట్ల మార్క్‌ను అధిగమిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 
కాగా, ఓవర్సీస్‌లో కూడా 'స్పైడర్' చిత్రం కలెక్షన్లను కుమ్మేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం క్లాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమాకు భారీ ఆదరణ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజు రూ.38 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఓవర్సీస్‌లో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ దీనికి కారణమని సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు తెలిపాడు. మహేష్ బాబు కెరీర్లో ఓవర్సీస్‌లో ఇప్పటివరకు హయ్యెస్ట్ గ్రాసర్‌గా 'శ్రీమంతుడు' ఉన్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments