Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్పైడర్ రివ్యూ రిపోర్ట్... సైకో కిల్లర్‌తో స్పైడర్ వార్.. ఎలా వుందంటే?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- మురుగదాస్ కాంబోలో తెరకెక్కిన చిత్రం స్పైడర్. ఈ సినిమా ద్విభాషా చిత్రంగా రూపొందింది. గజిని, తుపాకీ సినిమాల్లో మురుగదాస్ ఓ స్టైలిష్ యాక్షన్ చిత్రం చేశారు. పాన్ ఇండియా ఇమేజ్

Advertiesment
స్పైడర్ రివ్యూ రిపోర్ట్... సైకో కిల్లర్‌తో స్పైడర్ వార్.. ఎలా వుందంటే?
, బుధవారం, 27 సెప్టెంబరు 2017 (13:23 IST)
సినిమా : స్పైడర్ 
నటీనటులు: మహేష్‌బాబు, రకుల్‌ప్రీత్‌సింగ్‌, ఎస్‌.జె.సూర్య, భరత్‌ తదితరులు 
ఛాయాగ్రహణం: సంతోష్‌ శివన్‌ 
సంగీతం: హారిస్‌ జైరాజ్‌ 
బ్యానర్‌: ఎన్‌వీఆర్‌ సినిమా ఎల్‌ఎల్‌పీ, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 
ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌ 
నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు 
రచన, దర్శకత్వం: ఏఆర్‌ మురుగదాస్‌ 
 
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- మురుగదాస్ కాంబోలో తెరకెక్కిన చిత్రం స్పైడర్. ఈ సినిమా ద్విభాషా చిత్రంగా రూపొందింది. గజిని, తుపాకీ సినిమాల్లో మురుగదాస్ ఓ స్టైలిష్ యాక్షన్ చిత్రం చేశారు. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న మురగదాస్, స్టైల్‌కి మారుపేరైన మహేష్ బాబుని ఎలా చూపించాడో అని ఎదురుచూశారు. ఆ ఎదురు చూపులకి తెరదించుతూ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది స్పైడర్‌.
 
కథలోకి వెళ్తే.. ఇంటిలిజెన్స్ ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగిగా మహేష్ బాబు కనిపిస్తాడు. ఫోన్ కాల్స్ ట్యాప్ చేస్తూ అనుమానస్పదంగా అనిపించిన వారి వివరాలను పై అధికారులకు చేరవేసింది. అయితే ఇబ్బందులతో కష్టపడే వారి కోసం సొంతంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను కనిపెడతాడు. ఎవరికి ఎలాంటి ముప్పు వున్నా.. వెంటనే స్పందించి వారికి సాయం చేస్తుంటాడు. ఆ క్రమంలోనే ఓ అమ్మాయి తన స్నేహితురాలికి చేసిన కాల్‌ని వింటాడు. మా ఇంట్లో దెయ్యం వుందని భయపడుతున్న ఆ అమ్మాయికి సాయంగా వెళ్లాల్సిందిగా తన స్నేహితురాలైన ఓ లేడీ కానిస్టేబుల్‌ని ఆ ఇంటికి పంపుతాడు శివ. 
 
అక్కడికి వెళ్లిన లేడీ కానిస్టేబుల్‌తో పాటు సహాయం అర్థించిన అమ్మాయి దారుణంగా హత్యకు గురవుతారు. ఆ హత్యకు కారకులైన వారిని కనిపెట్టేందుకు రంగంలోకి దిగుతాడు శివ. ఆ క్రమంలోనే సైకో కిల్లర్‌ భైరవ(సూర్య) గురించి తెలుస్తుంది. భైరవ ఎవరు? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. హత్యలు చేసే అతనని శివ ఎలా అంతమొందించాడు అనేది తెలుసుకోవాలంటే.. ఈ సినిమా చూడాల్సిందే.
 
విశ్లేషణ: పరిచయం లేని వాళ్లకు కూడా సాయం చేయడమే నిజమైన మానవత్వం అనే అంశం ఆధారంగా తెరక్కించిన సినిమా ఇది. మురుగదాస్ మార్క్ సందేశం, థ్రిల్లింగ్ అంశాలతో సాగుతోంది. ఒక అమ్మాయి, లేడీ కానిస్టేబుల్‌ హత్య నుంచే కథ వేగం పుంజుకుంటుంది. ఆ కేసు పరిశోధన తీరు, భైరవ నేపథ్యం తదితర అంశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అక్కడి నుంచి హీరో-విలన్ల మధ్యే కథ నడుస్తుంది.
 
విలన్‌ సవాల్‌ విసిరిన ప్రతిసారీ హీరో తన ఇంటెలిజెన్స్‌తో ముప్పును పసిగట్టడం దాని నుంచి బయటపడేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా సాగుతాయి. విరామ  సమయానికి ముందు విలన్‌ పరిచయ సన్నివేశాలు ప్రేక్షకులను కథలో మరింత లీనం చేస్తాయి. ద్వితీయార్ధం కథ సినిమాకు చాలా కీలకం. విలన్‌ బంధించిన ఓ కుటుంబాన్ని, చుట్టుపక్కల కుటుంబాలతో విడిపించే సన్నివేశాలు తుపాకి సినిమాను గుర్తుకు తెచ్చినా, అవి ఉత్కంఠను రేకెత్తిస్తాయి. సాంకేతిక విలువలను ఉపయోగించిన ఈ సినిమా  ప్రేక్షకులను సీట్లకే అతుక్కుపోయేలా చేసింది. సాంకేతికత హాలీవుడ్‌ సినిమాలను గుర్తుకు తెస్తుంది. 
 
నటీనటులు.. మహేష్ బాబు మహేష్‌ తనదైన శైలి ఇంటెన్సిటీతో నటించాడు. దర్శకుడి ఆలోచనల్లో ఒదిగిపోయాడు. ఆయన పాత్ర చాలా స్టైలిష్‌గా సాగింది. రకుల్ పాత్రకు ప్రాధాన్యం లేదు. గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. ఎస్‌.జె. సూర్య నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులు పడతాయి.

గత మూడేళ్ల పాటు ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ వచ్చిన మహేష్ బాబు స్పైడర్ ద్వారా యాక్షన్ అవతారం ఎత్తాడు. ఇప్పటికే ఎన్టీఆర్ జై లవకుశ రిలీజై బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో స్పైడర్ రిలీజ్ కావడం వసూళ్ల ఏమాత్రం పెంచుకుంటుందో వేచి చూడాలి.
  
ప్లస్ పాయింట్స్ 
మహేష్‌, సూర్యల నటన 
సాంకేతిక హంగులు
 
మైనస్ పాయింట్స్
కథా, కథనాల్లో తడబాటు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండు పడవలపై కాళ్ళు పెట్టిన కమల్ హాసన్.. ఏమైంది...?